తెయూ(డిచ్‌పల్లి): ఆధునిక వ్యవసాయంలో బ్రాసినో స్టెరాయిడ్స్ కీలకపాత్ర పోషిస్తాయని ఉస్మానియా యూనివర్సిటీ విశ్రాంత ఆచా ర్యులు సీతారాంరావు పేర్కొన్నారు. సోమవా రం తెలంగాణ యూనివర్సిటీ వక్షశాస్త్ర విభా గం ఆధ్వర్యంలో ‘ఆధునిక వ్యవసాయంలో బ్రాసినో స్టెరాయిడ్స్ పాత్ర’ అనే అంశంపై ప్రొఫెసర్ సీతారాం రావు ఆహ్వానిత ఉపన్యా సం చేశారు. అధిక పంట దిగుబడికి, ప్రతికూల వాతావరణ పరిస్థితులలో బ్రాసినో స్టెరాయిడ్స్ ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. తక్కువ మోతాదులో బ్రాసినో స్టెరాయిడ్స్ ప్రభావవంతంగా పనిచేయడంతో ఆర్థికపరంగా, పర్యావరణానికి అనుకూలంగా ఉంటాయని వివరించారు. కార్యక్రమంలో బోటనీ విభాగాధిపతి అబ్దుల్ హలీం ఖాన్, బీవోఎస్ చైర్‌పర్సన్ అరుణ, అధ్యాపకులు విద్యావర్థిని, శ్రీనివాస్, జలందర్, విద్యార్థులు పాల్గొన్నారు.
సతీశ్‌కు డాక్టరేట్
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ బోటనీ (వృక్షశాస్త్ర) విభాగంలో పరిశోధక విద్యార్థి సతీశ్ డాక్టరేట్ సాధించారు. ప్రొఫెసర్ విద్యావర్థిని పర్యవేక్షణలో ‘సోలానం జాన్తోకర్పం యొక్క పెరుగుదల – దిగుబడిపై బ్రాసీనోస్టెరాయిడ్స్ –సాలిసిలిక్ యాసిడ్ ప్రభావం’ అనే అంశంపై సతీశ్ పరిశోధన పూర్తి చేసి సిద్ధాంత గ్రంథం సమర్పించారు. సోమవారం తెయూ సైన్స్ కళాశాల సెమినార్ హాల్‌లో నిర్వహించిన ఓపెన్ వైవావోస్‌కు ఉస్మానియా యూనివర్సిటీ బోటనీ విభాగం ప్రొఫెసర్ సీతారాంరావు ఎక్స్‌టర్నల్ ఎగ్జామినర్‌గా వ్యవహరించారు. సతీశ్‌ను పలు ప్రశ్నలు అడిగారు. సమాధానాలు రాబట్టి డాక్టరేట్ ప్రదానం చేశారు. కార్యక్రమంలో తెయూ బోటనీ బీవోఎస్ చైర్‌పర్సన్ అరుణ, విభాగాధిపతి మహ మ్మద్ అలీంఖాన్, సైన్స్ డీన్, కంట్రోలర్ సంపత్ కుమార్, విద్యావర్థిని, అధ్యాపకులు శ్రీనివాస్, జలంధర్, పరిశోధకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
సుభాష్‌నగర్: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ (ఐఐహెచ్‌ఎఫ్‌డబ్ల్యూ) గవర్నింగ్ కౌన్సిల్ చైర్‌పర్సన్‌గా ఇటీవల పదవీ బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ కవితారెడ్డిని నగర మేయర్ ఉమారాణి రమేశ్ సోమవారం సన్మానించారు. ప్రజా ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ రంగాల్లో కవితారెడ్డి నాయకత్వం మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్తుందని మేయర్ విశ్వాసం వ్యక్తంచేశారు.
రెడ్డి సంక్షేమ సంఘం..
ఐఐహెచ్‌ఎఫ్‌డబ్ల్యూ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ కవితారెడ్డిని సోమవారం రెడ్డి సంక్షేమ సంఘం (369) అధ్యక్షుడు గాదారి సంజీవ్‌రెడ్డి ఆధ్వర్యంలో సన్మానించారు. కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి మోతే నవీన్ రెడ్డి, కోశాధికారి అరికెల శ్రీకాంత్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు వినోద్ రెడ్డి, సలహాదారులు నాగిరెడ్డి, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


