కాపీయింగ్‌కు అవకాశం ఇవ్వొద్దు | - | Sakshi
Sakshi News home page

కాపీయింగ్‌కు అవకాశం ఇవ్వొద్దు

Mar 24 2026 8:45 AM | Updated on Mar 24 2026 8:45 AM

కలెక్టర్‌ ఇలా త్రిపాఠి

ఎస్సెస్సీ పరీక్ష కేంద్రాల తనిఖీ

ఖలీల్‌వాడి: పదో తరగతి పరీక్షల్లో కాపీయింగ్‌కు అవకాశం ఇవ్వొద్దని, ఒకవేళ కాపీయింగ్‌కు ఆస్కారం ఇస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని మానిక్‌భవన్‌, నలంద హైస్కూల్‌లోని పరీక్ష కేంద్రాలను ఆమె సోమవారం తనిఖీ చేశారు. విద్యార్థులు, సిబ్బంది హాజరుకు సంబంధించిన వివరాలను సీఎస్‌ను అడిగి తెలుసుకున్నారు. నిబంధనల ప్రకారం, నిర్ణీత సమయంలో ప్రశ్నాపత్రాలను తెరిచారా? అని అడిగారు. సీసీ కెమెరా రికార్డింగ్‌ నడుమ ప్రశ్నాపత్రాల బండిళ్ల సీళ్లు తెరవాలని సూచించారు. అనంతరం సీసీ ఫుటేజీలను పరిశీలించి నిబంధనలు పాటించారా? లేదా? అని నిర్ధారణ చేసుకున్నారు. హాల్‌లోకి సిబ్బంది ఎవరైనా సెల్‌ఫోన్లతో వచ్చారా? అని కలెక్టర్‌ పరిశీలించారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా సజావుగా పరీక్షలు జరిపించాలని సూచించారు. పరీక్షలు ముగిసేంత వరకు అప్రమత్తతతో, పకడ్బందీగా విధులు నిర్వహించాలని సూచించారు. ప్రశ్నాపత్రాలను తప్పనిసరిగా తగిన పోలీసు బందోబస్తు మధ్య కేంద్రాలకు తరలించాలని తెలిపారు. కలెక్టర్‌ వెంట పరీక్షా కేంద్రాల చీఫ్‌ సూపరింటెండెంట్లు శంకర్‌, శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు.

49 మంది గైర్హాజరు

పదో తరగతి వార్షిక పరీక్షలకు సోమవారం 49 మంది గైర్హాజరైనట్లు డీఈవో పార్శి అశోక్‌కుమార్‌ సోమవారం తెలిపారు. మూడో రోజు ఇంగ్లిష్‌ పరీక్షకు 24,395కు 24,346 మంది హాజరైనట్లు తెలిపారు. 144 పరీక్ష కేంద్రాల్లోని రెండు సెంటర్లను కలెక్టర్‌, తొమ్మిది డీఈవో, 38 ప్లయింగ్‌ స్క్వాడ్‌, మూడు కేంద్రాలలో ఏసీజీఈ తనిఖీలు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement