ఆపన్న హస్తం అందించరూ! | - | Sakshi
Sakshi News home page

ఆపన్న హస్తం అందించరూ!

Mar 22 2026 2:03 AM | Updated on Mar 22 2026 2:03 AM

ఆర్మూర్‌: పట్టణానికి చెందిన ఓ మహిళ బ్రెయిన్‌ ట్యూమర్‌ వ్యాధితో హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. వెంటనే ఆమె కు సర్జరీ చేయాలని, అందుకు రూ.25లక్షల వర కు అవసరం అవుతాయంటూ వైద్యులు పేర్కొనడంతో నిరుపేదలైన బాధితురాలి కుటుంబం ఆందోళన వ్యక్తం చేస్తోంది. దాతలు స్పందించి, సహాయం అందించాలని వారు వేడుకుంటున్నా రు. వివరాలు ఇలా.. ఆర్మూర్‌లోని రాజారాం నగర్‌కు చెందిన మాదాస్తు హేమలతకు భర్త జగన్‌, కుమారుడు, కూతురు ఉన్నారు. ఉగాది పర్వదినం రోజు హేమలత తలనొప్పితో ఇంటి ఆవరణలో పడిపోయింది. వెంటనే ఆ కుటుంబ సభ్యులు ఆర్మూర్‌లోని ఓ ప్రయివేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లగా, మెరుగైన చికిత్స కోసం జిల్లాకేంద్రానికి తీసుకెళ్లాలని సూచించారు. అక్కడ వైద్యులు పరీక్షించి ఆమె తలలోని మూడు నరాలలో బ్లడ్‌ క్లాట్‌ అవుతుందని వెంటనే హైదరాబాద్‌ తీసుకెళ్లాలని సూచించారు. దీంతో హేమలతను సికింద్రాబాద్‌ యశోద ఆస్పత్రిలో శుక్రవారం రాత్రి జాయిన్‌ చేశారు. వైద్యులు పరీక్షించి వెంటనే బ్రెయిన్‌ సర్జరీ చేయాలని, సుమారు రూ.25 లక్షల వరకు ఖర్చు అవుతుందని తెలిపారు. దీంతో ఆ నిరుపేద కుటుంబం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది. ఆర్థిక సాయం చేయాలంటూ దాతల కోసం బాధిత కుటుంబీకులు ఎదురుచూస్తున్నారు. సహాయం చేయదలచిన వారు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ అకౌంట్‌ నంబర్‌: 05122320000771, ఐఎఫ్‌సీ:హెచ్‌డీఎఫ్‌సీ0000512కి డబ్బులు పంపవచ్చు. లేదా 8074755223 నంబర్‌కు ఫోన్‌ పే చేయాలని బాధిత కుటుంబీకులు వేడుకుంటున్నారు.

ఆర్మూర్‌కు చెందిన

మహిళకు బ్రెయిన్‌ ట్యూమర్‌

సర్జరీ కోసం రూ.25లక్షలు

అవసరం

దాతల కోసం కుటుంబీకుల

ఎదురుచూపులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement