క్రైం కార్నర్
● కవలల దినోత్సవం రోజునే ఒక్కటైన జంట కవలలు
● అనుమానాస్పదస్థితిలో ఒకరు మృతి
మాచారెడ్డి: కవల జంటల పెళ్లితో ఆ ఇంట్లో వెల్లివిరిసిన ఆనందం ఒక్కసారిగా ఆవిరైంది. వివాహం జరిగిన నెలకే అన్నదమ్ముల్లో ఒకరు అనుకోని పరిస్థితుల్లో మృత్యువాతపడడంతో రెండు కుటుంబాల్లో పెను విషాదం అలుముకుంది. వివరాలు ఇ లా.. మండలంలోని ఘన్‌పూర్(ఎం) గ్రామానికి చెందిన కవలలైన విజయ్‌కుమార్, వినయ్‌కుమా ర్‌ల వివాహం గత నెల 22న తాడ్వాయి మండలం దేమెకలాన్ గ్రామానికి చెందిన కవలలైన అక్కా చెల్లెళ్లతో పెళ్లి జరిగింది. కవలల దినోత్సవం నాడే వారి వివాహం జరగడంతో సామాజిక మాధ్యమాల్లోనూ వారు వైరల్ అ య్యారు. ఇదిలా ఉండగా కవలల్లో చిన్నవాడైన వినయ్‌కుమార్ (31) శుక్రవా రం రాజన్న సిరిసిల్లా జిల్లా గంభీరావుపేట మండ లం ఎగువ మానేరులో శవమై కనిపించాడు. ప్రమా దవశాత్తు అందులో పడి ఉంటాడని భావిస్తున్నారు.
విషాదంలో కుటుంబం..
చిన్నతనంలో తండ్రిని కోల్పోయిన గడ్డు పరిస్థితుల్లో తల్లి సుజాత అన్నీ తానై ఐదుగురు పిల్లల్ని(నలుగురు కుమారులు, ఒక కూతురు) చదివించింది. సోదరులు చదువులో ముందు వరుసలో ఉంటూ ఉద్యోగాలు సాధించారు. అమ్మాయిని చదివించి పెళ్లి చేశారు. తర్వాత కవలలైన విజయ్‌కుమార్, వినయ్‌కుమార్‌ల వివాహం జరిపించేందుకు కవలలైన అక్కాచెల్లెల్లను వెదికి పెళ్లి చేశారు. ఎంతో ఆనందంగా ఉన్న ఆ ఇంట్లో వినయ్ మృతితో ఇప్పుడు తీరని వేధన మిగిలింది. హృదయవిధారకంగా మారిన ఆ ఇంటి పరిస్థితులను చూసిన గ్రామస్తులు, బంధువులు కంటతడిపెట్టారు. శనివారం ఘన్‌పూర్(ఎం) గ్రామంలో జరిగిన అంత్యక్రియల్లో వందలాది మంది పాల్గొన్నారు.


