ఇక రాజీవ్‌ యువ వికాసమే.. | - | Sakshi
Sakshi News home page

ఇక రాజీవ్‌ యువ వికాసమే..

Mar 22 2026 2:02 AM | Updated on Mar 22 2026 2:02 AM

మోర్తాడ్‌(బాల్కొండ): నిరుద్యోగ యువతకు స్వ యం ఉపాధి కోసం రూపొందించిన రాజీవ్‌ యువ వికాసం పథకానికి ఎట్టకేలకు నిధుల కేటాయింపు జరిగింది. డిప్యూటీ సీఎం, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రూ.6 వేల కోట్లను రాజీవ్‌ యువ వికాసం పథకానికి కేటాయించడంతో దరఖాస్తుదారుల్లో ఆశలు చిగురిస్తున్నా యి. నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించేందు కు రాజీవ్‌ యువ వికాసం పథకానికి 2025లో ప్రభు త్వం భారీ మొత్తంలో దరఖాస్తులను స్వీకరించింది. ఇందులో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొ రేషన్‌లకు జిల్లాలో 58 వేలకు పైగా దరఖాస్తులు అందాయి. ఆయా సామాజిక వర్గాల వారికి కార్పొ రేషన్ల ద్వారా రాయితీ రుణాలను రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున అందించేందుకు ప్రభుత్వం తొ లుత నిర్ణయించింది. అయితే, అప్పట్లో నిధుల కే టాయింపులు లేకపోవడం, ఇతర సాంకేతిక కారణాలతో పథకం అమలుకు బ్రేక్‌ పడింది.

చిన్న రుణాలకు వంద శాతం రాయితీ...

ఈ పథకం ద్వారా రూ.50 వేల వరకు వందశాతం, రూ. లక్ష వరకు ఇచ్చే రుణానికి 90 శాతం, రూ.2 లక్షల వరకు రుణాలకు 80 శాతం, రూ.4 లక్షల వర కు రుణాలకు 70 శాతం రాయితీని ప్రకటించారు. బ్యాంకు లింకేజీ ద్వారానే రుణాలను అందించాలని నిర్ణయించగా రుణ ప్రక్రియ పూర్తి కాగానే రాయితీ సొమ్మును అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అనేక మంది రూ.4 లక్షల వరకు రుణం కావాలని దరఖాస్తులు అందించారు. నిధులు లేకపోవడంతో పథకం అమలు ముందుకు సాగలేదు. తాజాగా రాష్ట్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించడంతో రాజీవ్‌ వికాసం రాయితీ రుణాలు అందుతాయని యువత ధీమా వ్యక్తం చేస్తున్నారు.

పథకానికి బడ్జెట్‌లో

రూ.6 వేల కోట్ల నిధుల కేటాయింపు

నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోసం అందనున్న రుణాలు

జిల్లాలో 58 వేలకు పైగా

దరఖాస్తుదారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement