నిజామాబాద్ అర్బన్: జిల్లాలో రంజాన్ పండుగను శనివారం ముస్లింలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈద్గాల వద్ద వారు ప్రత్యేక ప్రార్థలు నిర్వహించగా, పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. నగరంలోని ఖిల్లా ఈద్గాను సీపీ సాయిచైతన్య పరిశీలించారు. ముస్లింలు ప్రత్యేక ప్రార్థన లు చేసే ప్రాంతం వద్ద బందోబస్తును పరిశీలించారు. సీపీ మాట్లాడుతూ.. రంజాన్ రోజున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, భారీగా పోలీసు బలగాలను మోహరించామన్నారు. అంతకుముందు నగరంలోని ముస్లింలకు అర్బన్ ఎమ్మె ల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, మేయర్ ఉమారాణిలు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.


