గురుకులాలకు గూడు కరువు | - | Sakshi
Sakshi News home page

గురుకులాలకు గూడు కరువు

Mar 22 2026 2:02 AM | Updated on Mar 22 2026 2:02 AM

మోర్తాడ్‌(బాల్కొండ): వెనుకబడిన తరగతుల వి ద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన మహాత్మ జ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాలలకు సొంత భవనాల ని ర్మాణం కలగానే మిగిలిపోనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో బీసీ గురుకుల పాఠశాలలకు సొంత భవనాలను నిర్మించే అంశంపై ప్రభుత్వం ఎలాంటి ప్రస్తావన తీసుకురాలేదు. కాగా, కొత్తగా ఒక్కో నియోజకవర్గానికి తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ ఏర్పాటు, భవనాల నిర్మాణంపైనే ప్రభుత్వం స్పష్ట త ఇచ్చింది. బీసీ గురుకుల పాఠశాలల కోసం 2024–25 బడ్జెట్‌లో రూ.1,546 కోట్లు కేటాయించి నా ఎక్కడ కూడా నిర్మాణాలను చేపట్టలేదు. స్థల సే కరణ జరుపకపోవడంతో అద్దె భవనాల్లోనే వాటిని కొనసాగిస్తున్నారు. జిల్లాలో మోర్తాడ్‌, ఎడపల్లి, ఆ ర్మూర్‌, బాల్కొండ, కుద్వాన్‌పూర్‌, బోధన్‌, శ్రీరాంపూర్‌, చీమన్‌పల్లి, నిజామాబాద్‌లలో బాలుర, బా లికలకు వేర్వేరుగా పాఠశాలలను నిర్వహిస్తున్నారు. 2017–18 విద్యా సంవత్సరంలో బీసీ గురుకుల పాఠశాలలను ప్రారంభించగా ఎక్కడ కూడా సొంత భవనాలు లేకపోవడం గమనార్హం. బీఆర్‌ఎస్‌ ప్రభు త్వం బీసీ గురుకుల పాఠశాలల ప్రారంభానికి చూి పన ఆసక్తి భవనాల నిర్మాణంపై దృష్టి సారించలే దు. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం భవనాల నిర్మాణం కోసం నిధులు కేటాయించినా అడుగులు మాత్రం ముందుకు పడలేదు. ఇంటిగ్రేటెడ్‌ పాఠశాలల ఏ ర్పాటును తెరపైకి తీసుకురావడంతో గురుకుల పాఠశాలలకు సొంత భవనాల నిర్మాణం మరుగునపడినట్లేనా అనే సందేహం నెలకొంది.

బడ్జెట్‌లో నిధులు కేటాయించని

రాష్ట్ర ప్రభుత్వం

పాత పాఠశాలల ఊసెత్తక.. తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్ల ఏర్పాటుపై ప్రస్తావన

గతంలో బీసీ గురుకులాల కోసం

నిధులు కేటాయించినా భవన నిర్మాణాలకు పడని అడుగులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement