సరికొత్తగా సర్కారు విద్య | - | Sakshi
Sakshi News home page

సరికొత్తగా సర్కారు విద్య

Mar 22 2026 1:31 AM | Updated on Mar 22 2026 1:31 AM

ఖలీల్‌వాడి: రాష్ట్ర బడ్జెట్‌లో యంగ్‌ ఇండియా, తెలంగాణ పబ్లిక్‌ స్కూల్స్‌, ఇంటర్‌ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, ఏటీసీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ తదితర సౌకర్యాలు కల్పించనుండటంతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే, స్కాలర్‌షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాలకు సంబంధించి బకాయిలకు నిధుల కేటాయింపుల ప్రస్తావన లేకపోవడంపై పెదవి విరుస్తున్నారు.

నాలుగు స్కూళ్లకు స్థల సేకరణ పూర్తి

జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే వీటికి సంబంధించిన స్థల సేకరణ కూడా పూర్తి చేశారు. ఒక్కో పాఠశాలకు రూ.200 కోట్ల చొప్పున ఐదు పాఠశాలలకు రూ. వెయ్యి కోట్లు కేటాయించనున్నారు. నిజామాబాద్‌ రూరల్‌లో మల్కాపూర్‌, బోధన్‌ నియోజకవర్గంలో బెల్లాల్‌, ఆర్మూర్‌ నియోజకవర్గంలో అంకాపూర్‌, బాన్సువాడ నియోజకవర్గం పోతంగల్‌లో స్థలం సేకరించగా, నిజామాబాద్‌ అర్బన్‌లో స్థల పరిశీలన జరుగుతోంది. జిల్లాలోని ఐదు అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్‌లలో చదువుతున్న 812 మంది విద్యార్థులకు నెలకు రూ.2 వేల చొప్పున స్కాలర్‌షిప్‌ అందనున్నది. అంతేకాకుండా ఇందల్వాయి, ఆర్మూర్‌, వర్నిలో కొత్తగా ఏటీసీలను ఏర్పాటు చేయనున్నారు. నిజామాబాద్‌, నందిపేట్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలను ఏటీసీలుగా ఉన్నతీకరించి కొత్త కోర్సులు ప్రారంభించనున్నారు. అదే విధంగా జిల్లాలోని 33 ప్రభుత్వ పాఠశాలలు తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్లుగా మారనున్నాయి.

బకాయిలపై ప్రస్తావన కరువు..

బడ్జెట్‌లో స్కాలర్‌షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాలకు సంబంధించిన బకాయిలపై ప్రస్తావన రాకపోవడంతో ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు నిరాశ చెందాయి. జిల్లాలోని తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఉన్న డిగ్రీ కళాశాలలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం ద్వారా సుమారు రూ.200 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. బెస్ట్‌ అవైలెబుల్‌ స్కూళ్లకు సుమారు రూ.50 కోట్ల వరకు ప్రభుత్వం బకాయి పడింది.

కేటాయింపులు పెంచాలి..

విద్యారంగానికి కేవలం 26,674 కోట్లు (8.2 శాతం) మాత్రమే కేటాయించటం వి ద్యారంగాన్ని విస్మరించడ మే. విద్యా కమిషన్‌ సూచించిన 18 శాతం నిధుల ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెట్టింది. వి ద్యారంగ అభివృద్ధికి బడ్జెట్‌లో 20 శాతం నిధులు కేటాయించాలి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు రూ.8500 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. దీనిపై ప్రస్తావన లేదు. – జన్నారపు రాజేశ్వర్‌,

పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి, నిజామాబాద్‌

నిధులు సరిపోవు

ప్రభుత్వ బడులు, సంక్షేమ హాస్టళ్లు, జూనియర్‌ కాలేజీ లు, డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీ స్థాయిలలో అభివృద్ధికి ఈ నిధులు ఏమాత్రం స రిపోదు. ఖాళీగా ఉన్న టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టులను భర్తీ చేసేలా ప్రభుత్వం విద్యా రంగంపై దృష్టి పెట్టలేదు.

– రఘురాం నాయక్‌, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి, నిజామాబాద్‌

జిల్లాలో 769 ప్రాథమిక, 132 ప్రాథమికోన్నత, 255 ఉన్నత పాఠశాలలు ఉండగా, వా టిలో లక్షా 90 వేలకు పైగా విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికీ కొత్తగా బ్రేక్‌ ఫా స్ట్‌ పథకాన్ని అమలు చేయనున్నారు. ఉద యం వేళలో రాగి జావ లేదా అల్పాహారాన్ని అందించేందుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. మరోవైపు కొత్తగా ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించనున్నారు. ఈ పథకం ద్వారా జిల్లాలోని 16 ప్రభుత్వ కళాశాలలు, 71 ప్రభుత్వ సెక్టార్‌ కళాశాలల్లోని 36,969 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ పథకం ద్వారా ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్‌ చదివే విద్యార్థుల సంఖ్య పెరుగనున్నది.

బ్రేక్‌ఫాస్ట్‌.. మధ్యాహ్న భోజనం

జిల్లాకు ఐదు యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్లు

తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్లుగా

మారనున్న 33 బడులు

ప్రీప్రైమరీ నుంచి ఇంటర్‌ వరకు

అల్పాహారం

ఇంటర్‌ విద్యార్థులకు

మధ్యాహ్న భోజనం అమలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement