ఇందల్వాయి: హత్య రాజకీయాలను కాంగ్రెస్ పార్టీ సహించదని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అ న్నారు. కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి హ త్య కేసులో నిష్పక్షపాతంగా వి చారణ జరిగేలా చూస్తామని, అతడి కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటూ న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఇటీవల హత్యకు గురైన ఇమ్మడి గోపి కుటుంబాన్ని ఎమ్మెల్యే భూపతి రెడ్డి డీసీసీ అధ్యక్షుడు నాగేశ్‌రెడ్డితో కలిసి శనివారం పరామర్శించారు. ఇమ్మడి గోపి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఇమ్మడి గోపి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని అన్నారు. ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, సీనియర్ నాయకుడు మునిపల్లి సాయిరెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నవీన్ గౌడ్, అమృతపూర్ గంగాధర్ గౌడ్, చింతల కిషన్ నాయకులు పాల్గొన్నారు.
● ఇమ్మడి గోపి కుటుంబానికి న్యాయం చేస్తాం
● బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు


