రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క విద్యారంగానికి రూ. 26,674 కోట్లు కేటాయించడం హర్షనీయం. మాధ్యమిక విద్యకు రూ.21,231 కోట్లు, ఉన్నత విద్యకు రూ.5,443 కోట్లు కేటాయించారు. సీఎం ఓవర్సీస్ ఎంప్లాయీమెంట్ స్కీం ను 2026–27 అకడమిక్ ఇయర్ నుంచి అమలు చేస్తామని ప్రకటించడం హర్షనీయం. – టీ సంపత్, అసిస్టెంట్ ప్రొఫెసర్, తెయూ
నిజామాబాద్ రూరల్/ ఖలీల్‌వాడి/ తెయూ(డిచ్‌పల్లి): రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో శుక్రవారం రూ. 3,24,234 కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ భవిష్యత్తు అభివృద్ధికి బా టలు వేసేలా ఉందని కొందరు పేర్కొనగా మరికొందరు అంకెల గారడిగా, ప్రజలను నిరాశపరిచేదిగా ఉందని అన్నారు. విద్య,వైద్య, కార్మిక శాఖలకు అధిక నిధులు కేటాయించలేదని పలువురు తమ అభిప్రాయాలను సాక్షితో పంచుకున్నారు.
ప్రభుత్వం రూ.3,24, 234 కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. వ్య వసాయ అభివృద్ధి కో సం రూ. 23,179 కో ట్లు, రైతు భరోసాకు రూ. 18వేల కోట్లు కేటాయించి రైతు సంక్షేమ ప్రభుత్వంగా నిలిచింది. – బొబ్బిలి రామకృష్ణ, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు
బడ్జెట్‌లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు నగదు రహిత వైద్య సదుపాయాన్ని అందించే ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెట్టడం సంతోషకరం. సీఎంకు కృతజ్ఞతలు.
– పండరినాథ్, ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు
బడ్జెట్‌లో మైనారిటీలకు అరకొరగా నిధులను కేటాయించడం దురదృష్టకరం. మైనారిటీ డిక్లరేషన్‌లో పేర్కొన్న ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేదు.
– ఎండీ యాకుబ్ పాషా, మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కార్మికుల సంక్షేమానికి అన్యాయం జరిగింది. పెద్దగా కేటాయింపులు చేపట్టలేదు. జిల్లా అభివృద్ధికి బడ్జెట్‌లో నిధుల కేటాయింపు పెంచకపోవడం బాధాకరం. – వై ఓమయ్య,
ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి


