ఆర్మూర్‌టౌన్: రంజన్ పండుగ సందర్భంగా పార్కింగ్ ప్రాంతాలలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూడాలని పోలీస్ అధికారులకు జిల్లా పోలీస్ కమిషనర్ సాయిచైతన్య సూచించారు. ఈద్గా ప్రాంతాల్లో ముస్లింలు సామూహిక ప్రార్థనలు దృష్టిలో ఉంచుకొని శుక్రవారం ఆర్మూర్ శివారు నిజామాబాద్ రోడ్డులో గల ఈద్గా ప్రాంతాన్ని సందర్శించారు. ఈసందర్భంగా ట్రాఫిక్, పార్కింగ్, భద్రతపై నిర్వాహకులతో అధికారులు చర్చించారు. ప్రత్యేక ప్రార్థన కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్ పాల్గొన్నారు.


