అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రజలకు ఉపయోగపడే స్కీమ్‌లకు సరైన కేటాయింపులు లేవు. అవినీతి అవకాశాలు ఉన్న ప్రాజెక్టులకు భారీ నిధులు కేటాయించారు. ఈ బడ్జెట్ పూర్తిగా డొల్ల బడ్జెట్, గోల్‌మాల్ బడ్జెట్. అంకెల గారడీతో పేద ప్రజలు, మహిళలు, నిరుద్యోగులను పూర్తిగా వంచించిన బడ్జెట్‌గా ఉంది. గత సంవత్సరం బడ్జెట్ అంచనాలను ఈ ప్రభుత్వం అందుకోలేక పూర్తిగా విఫలమైందని ఇప్పటికే స్పష్టమైంది. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీల అమలులో ఈ బడ్జెట్ వాస్తవికతకు దూరంగా ఉంది. రైతుభరోసా ఇప్పటి వరకు మూడు పంటలకు ఎగ్గొట్టారు. ప్రభుత్వానికి భూములపై ఉన్న ప్రేమ.. ప్రజలకు ఇచ్చిన హామీలపై లేదు. ఆచరణకు సాధ్యం కాని రాజీవ్ యువ వికాసా నికి ప్రతి సంవత్సరం కేటాయింపులు చేస్తూ వస్తున్నారు.
– వేముల ప్రశాంత్‌రెడ్డి, బాల్కొండ ఎమ్మెల్యే


