కౌంటింగ్ హాల్, స్ట్రాంగ్ రూమ్ పరిశీలన
సుభాష్‌నగర్: మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నగరంలోని పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ హాళ్లు, స్ట్రాంగ్ రూమ్‌లను మున్సిపల్ కమిషనర్ దిలీప్‌కుమార్ సోమవారం పరిశీలించారు. కౌంటింగ్ కోసం డివిజన్ల వారీగా ఏర్పాటు చేసిన టేబుళ్లు, విద్యుత్ సరఫరా, పోలింగ్ కేంద్రాల సంఖ్య, ఇతరత్రా వసతులను అడిగి తెలుసుకున్నారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద బందోబస్తు, బ్యాలెట్ బాక్సుల రవాణా, సిబ్బందిపై ఆరా తీశారు. కౌంటింగ్ హాళ్లు, స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని కమిషనర్ సూచించారు. ఆయన వెంట టౌన్‌ప్లానింగ్ ఏసీపీలు, అధికారులు ఉన్నారు.


