ఎయిర్‌పోర్ట్ ఊసెత్తలేదు..
ఆర్మూర్ – నిర్మల్ – ఆదిలాబాద్ రైల్వే లైన్ ప్రసక్తే లేదు
● రుణాలతో మహిళా సంఘాలకు మేలు
● ప్రాణాధార ఔషధాలపై తగ్గిన పన్ను
● కేంద్ర బడ్జెట్‌పై మిశ్రమ స్పందన
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ఆదివారం పార్ల మెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో జక్రాన్‌పల్లి విమానాశ్రయం ప్రస్తావన లేకపోవడం జిల్లా వాసులను నిరాశకు గురి చేసింది. ఇక ఆర్మూ ర్–నిర్మల్–ఆదిలాబాద్ రైల్వే లైన్ ఊసే లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎస్‌హెచ్‌జీ మహిళల కోసం పథకంపై హర్షం వ్యక్తమవుతోంది. ఇక 5 లక్షల పైగా జనాభా ఉన్న నగరాల్లో మౌలిక సదుపాయాల కల్పన చేస్తామ ని చెప్పడం నిజామాబాద్ నగరానికి కలిసొ స్తుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. బడ్జె ట్‌పై భిన్న స్వరాలు వినిపించాయి. బీజేపీ నాయకులు, మద్దతుదారులు బడ్జెట్ బాగుందని చెప్పగా విపక్షాలు పెదవి విరిచాయి. సామాన్య ప్రజల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. బడ్జెట్‌పై తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారిలా..
– సాక్షి ప్రతినిధి, నిజామాబాద్
ఎయిర్‌పోర్ట్ ఊసెత్తలేదు..
ఎయిర్‌పోర్ట్ ఊసెత్తలేదు..


