మున్సిపల్‌ కౌన్సిల్‌ నుంచి లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌కు.. | - | Sakshi
Sakshi News home page

మున్సిపల్‌ కౌన్సిల్‌ నుంచి లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌కు..

Feb 2 2026 8:17 AM | Updated on Feb 2 2026 8:17 AM

మున్స

మున్సిపల్‌ కౌన్సిల్‌ నుంచి లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌కు..

రెండు సార్లు కౌన్సిలర్‌..

మూడుసార్లు ఎమ్మెల్సీగా

పని చేసిన డి రాజేశ్వర్‌

ఖలీల్‌వాడి: నిజామాబాద్‌ మున్సిపల్‌ కౌన్సిలర్‌గా రెండుసార్లు పని చేసిన డి రాజేశ్వర్‌ మూడుసార్లు శాసన మండలి (లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌) సభ్యుడిగా కొ నసాగారు. జిల్లా కేంద్రంలోని శివాజీనగర్‌ చౌరస్తా కు చెందిన రాజేశ్వర్‌ కౌన్సిలర్‌గా, ఎమ్మెల్సీగా, రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా పని చేసి రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని పదిలిపర్చుకున్నారు. 1981లో నిజామాబాద్‌ మున్సిపాలిటీ 17వ వార్డు నుంచి ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప మోజార్టీతో ఓటిమి పాలయ్యారు. తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. 1987లో జరిగిన మున్సిపల్‌ ఎన్నిక ల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఎల్లయ్యపై 850 మోజార్టీతో గెలుపొందారు. తర్వాత 1995లో పోటీ చేసి టీడీపీకి చెందిన పోచయ్యపై వెయ్యి ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 1999లో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని జుక్కల్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా శాసనసభకు పోటీ చేశారు. అ క్కడ కాంగ్రెస్‌ రెబల్‌ అభ్యర్థిగా సౌదాగర్‌ గంగారాం పోటీ చేయడంతో ఓటమిపాలయ్యారు. 2004లో జుక్కల్‌ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలని ఆశించినా కాంగ్రెస్‌ టికెట్‌ దక్కకపోవడంతో రెబల్‌గా రంగంలో ఉండేందుకు సిద్ధమయ్యారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సూచనల మేరకు వెనక్కి తగ్గారు. వై ఎస్సాఆర్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత 2005లో రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా నియమితులైన రాజేశ్వర్‌.. జిల్లాకు అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్లను కేటాయించారు. గవర్నర్‌ కోటాలో 2007లో (వైఎస్సాఆర్‌ హయాం), 2011లో (కిరణ్‌కుమార్‌రెడ్డి) ఎమ్మెల్సీగా రాజేశ్వర్‌కు అవకాశం దక్కింది. 2014లో జుక్కల్‌ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధం కాగా, టిక్కెట్‌ లభించకపోవడంతో కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్‌లో చేరారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2017లో మరోసారి గవర్నర్‌కోటాలో రాజేశ్వర్‌కు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది. 2023లో బీఆర్‌ఎస్‌ హయాంలో రాష్ట్ర క్రిస్టియన్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా నియమితులయ్యారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో తిరిగి సొంత గూటికి చేరుకున్నారు.

మున్సిపల్‌ కౌన్సిల్‌ నుంచి లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌కు..1
1/1

మున్సిపల్‌ కౌన్సిల్‌ నుంచి లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌కు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement