పచ్చ ‘బంగారం’ పండింది! | - | Sakshi
Sakshi News home page

పచ్చ ‘బంగారం’ పండింది!

Feb 2 2026 8:17 AM | Updated on Feb 2 2026 8:17 AM

పచ్చ

పచ్చ ‘బంగారం’ పండింది!

సౌమ్యకు కన్నీటి వీడ్కోలు

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): రైతన్న ఇంట పచ్చ బంగారం పండింది. ఎకరానికి 25 నుంచి 30 క్వింటాళ్ల దిగుబడి రావడంతో రైతుల్లో ఆనందం కనిపిస్తోంది. గతేడాది భారీ వర్షాలు కురిసినా పసుపు దిగుబడిపై పెద్దగా ప్రభావం పడలేదు. చాలా మంది రైతులు బెడ్‌ విధానంలో పంటను సాగు చేయడంతో సంతృప్తికరమైన దిగుబడి వస్తోంది. కొమ్ముకు దుంపకుళ్లు లాంటి వైరస్‌ లేకపోవడంతో పంట నాణ్యతగా కనిపిస్తోంది. జిల్లాలో రైతులు 23,611 ఎకరాల్లో పసుపు పంటను సాగు చేశారు. సుమారు 200 రోజులు గడిచిన తర్వాత పంటను తవ్వి బయటకు తీస్తున్నారు. మహారాష్ట్ర కూలీలతో పసుపును తవ్వించి ట్రాక్టర్ల ద్వారా కల్లాలకు తరలిస్తున్నారు. అక్కడ బాయిలర్లలో పచ్చి కొమ్మును ఉడికించి ఎండబోస్తున్నారు. బాగా ఎండిన దానిని వెంటనే మార్కెట్లకు తరలించి విక్రయిస్తున్నారు. మార్కెట్లలో ప్రస్తుతం క్వింటాల్‌కు రూ.14వేలకు పైగా ధర లభిస్తోంది. ధరలో స్వల్ప హెచ్చుతగ్గులు కనిపిస్తున్నా రైతులు పర్వాలేదంటున్నారు. అదే పక్కనున్న మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్‌లో రూ.17వేల వరకు ధర వస్తోంది. పాత పసుపుకై తే మరో వెయ్యి అదనంగా లభిస్తోంది.

వర్ని(బాన్సువాడ): గంజాయి అక్రమ రవాణాను అడ్డుకునే క్రమంలో తీవ్రగాయాలపాలై ప్రాణాలొదిలిన ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ సౌమ్యకు కుటుంబ సభ్యు లు, అధికార యంత్రాంగం, ప్రజలు కన్నీటి వీడ్కో లు పలికారు. సౌమ్య అంత్యక్రియలను ఆమె స్వగ్రామమైన మోస్రాలో అధికారిక లాంఛనాలతో ఆదివారం నిర్వహించారు. ఎకై ్సజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్‌రెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్‌ తాహెర్‌, కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, సబ్‌ కలెక్టర్‌ వికాస్‌ మహతో, సీపీ సాయిచైతన్య, ఎకై ్సజ్‌ ఉన్నతాధికారులు పాల్గొని సౌమ్య పార్థివ దేహానికి నివాళులర్పించారు. బాధిత కుటుంబానికి రూ.కోటి ఆర్థిక సాయాన్ని ప్రకటించిన మంత్రి జూపల్లి.. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

డొంకేశ్వర్‌లో పసుపును తవ్వి ట్రాక్టర్‌లో నింపుతున్న కూలీలు

పాల్గొన్న మంత్రి, ప్రభుత్వ సలహాదారులు

నాణ్యమైన దిగుబడి వచ్చింది

ఎకరంన్నర భూమిలో పసుపు సాగు చేస్తే మంచి దిగుబడి వచ్చింది. ఎకరానికి ఎడెనిమిది ట్రాక్టర్లు ఎల్లింది. బాగా కురిసిన వర్షాలకు దిగుబడి తగ్గుతుందని రైతులంతా భయపడ్డారు. ఇప్పుడు నాణ్యమైన దిగుబడిని చూసి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

– కుర్మె దేవన్న, రైతు, తొండాకూర్‌, డొంకేశ్వర్‌ మండలం

ఎకరానికి ఎనిమిది ట్రాక్టర్ల దిగుబడి

జీజీ నడ్కుడ, నూత్‌పల్లి శివా ర్లలో కలిపి మొత్తం ఎనిమిది ఎకరాల్లో పసుపు వేశాను. తవ్వితే ఎకరానికి మండతో కలిపి ఎనిమిది ట్రాక్టర్ల దాకా దిగుబడి వస్తోంది. గతేడాది కన్నా మంచి దిగుబడి వచ్చింది. మంచి ధర వచ్చేలా ఉడికించిన పసుపును బాగా ఎండబోసి మార్కెట్‌కు తీసుకెళ్తాం.

– చిన్న రాజన్న, రైతు,నూత్‌పల్లి, డొంకేశ్వర్‌ మండలం

ఎకరానికి 25 నుంచి 30 క్వింటాళ్ల

పసుపు దిగుబడి

ఆశించిన దిగుబడి రావడంతో

రైతుల్లో ఆనందం

మార్కెట్‌లో క్వింటాల్‌కు

రూ.14వేలు లభిస్తున్న ధర

పచ్చ ‘బంగారం’ పండింది! 1
1/4

పచ్చ ‘బంగారం’ పండింది!

పచ్చ ‘బంగారం’ పండింది! 2
2/4

పచ్చ ‘బంగారం’ పండింది!

పచ్చ ‘బంగారం’ పండింది! 3
3/4

పచ్చ ‘బంగారం’ పండింది!

పచ్చ ‘బంగారం’ పండింది! 4
4/4

పచ్చ ‘బంగారం’ పండింది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement