లా అండ్ ఆర్డర్ పరిరక్షణకు కృషి చేయాలి
ఇందల్వాయి: గ్రామాల్లో లా అండ్ ఆర్డర్ పరిరక్షణకు సర్పంచులు పోలీసులకు సహకారం అందించాలని డిచ్‌పల్లి సీఐ వినోద్,ఎస్సై సందీప్ అన్నారు. నూతనంగా ఎన్నికై న సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లతో ఎల్లరెడ్డిపల్లె గ్రామంలో శనివారం సమావేశం నిర్వహించారు. సీఐ మాట్లాడుతూ.. గ్రామాల్లో నేరాలు జరగకుండా, యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా గ్రామ సభల్లో తీర్మానాలు చేసి అందుకు అనుగుణంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. గ్రామాల్లో అనుమానస్పద వ్యక్తుల వివరాలను సేకరించాలని, గ్రామాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సర్పంచులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
జక్రాన్‌పల్లి: మండలంలోని కొలిప్యాక్ గ్రామానికి చెందిన గల్ఫ్ బాధితుడు కమ్మరి అరుణ్‌కు గల్ఫ్ డ్రైవర్స్ అసోసియేషన్, డీఎస్పీ ఎన్నారై తరఫున రూ. 32వేల ఆర్థికసాయన్ని అందజేశారు. గ్రామానికి చెందిన అరుణ్ అనారోగ్యం కారణంగా ఇటీవల దుబాయి నుంచి ఇంటికి తిరిగి వచ్చాడు. దీంతో మెరుగైన వైద్యం కోసం అరుణ్‌కు రూ. 32వేల ఆర్థికసాయిన్ని జిల్లా ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ నాయకుడు ప్రేమ్‌కుమార్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ దాసరి రవి, ధర్మ సమాజ్ పార్టీ మండల అధ్యక్షుడు మహేశ్, భాస్కర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
డిచ్‌పల్లి: మండలంలోని సాంపల్లి తండా సర్పంచ్ రాథోడ్ మమత భర్త రాహుల్ సింగ్ సర్పంచ్ కుర్చీలో కూర్చుని పెత్తనం చెలాయిస్తున్నారని మాజీ సర్పంచ్ జగదీశ్ రాథోడ్ ఆరోపించారు. ఈ మేరకు శనివారం ఆయన ఎంపీవో శ్రీనివాస్ గౌడ్‌ను కలిసి ఫిర్యాదు అందజేశారు. అధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందించిన ఎంపీవో విచారణ చేపడతామని అన్నారు.
నిజామాబాద్‌అర్బన్: రాష్ట్ర వనరులపైన అవగాహనలేని సీఎం రేవంత్ రెడ్డి అధికారంలో ఉండటం రాష్ట్రాభివృద్ధికి అవరోధమేనని జిల్లా భారాస లీగల్ సెల్ కన్వీనర్ దాదన్నగారి మధుసూదన్‌రావు శనివారం అన్నారు. కేసీఆర్ సంధించిన ప్రశ్నలకు జవాబులు చెప్పలేక తికమకపడి తప్పుడు మాటలు మాట్లాడటం సీఎం హో దాకు తగదని ఆయన పేర్కొన్నారు. తెలంగా ణ జల వనరులు మళ్లీ ఆంధ్రపాలకుల పరం చేస్తున్నడానికి రేవంత్ సమాధానం ఇవ్వకుండా బజారు భాషలో కేసీఆర్ పై నోరు జారడం తెలివితక్కున తనమేనని ఆయన తెలిపారు.
సిరికొండ: మండలంలోని న్యావనంది గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలను డీఈవో అశోక్ శనివారం తనిఖీ చేశారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హైస్కూల్‌లో గదుల్లో ఫ్లోరింగ్, ప్రైమరీ స్కూల్‌లో ప్రహరీ నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తానని డీఈవో హమీ ఇచ్చారు. ఎంఈవో రాములు, జీహెచ్‌ఎం తిరుపతి, రాజేశ్వర్, కాంగ్రెస్ నాయకులు మామిడికింది నరేందర్, మహిపాల్, గొల్ల జనార్దన్ తదితరులు ఉన్నారు.
ఇందల్వాయి: మండలంలోని ధర్పల్లి రోడ్డు నుంచి జీకే తండాకు వెళ్లే రోడ్డు మార్గంలో దట్టంగా పెరిగిన చెట్ల పొదలను ట్రాక్టర్‌తో శనివారం తొలగించినట్లు సర్పంచ్ శిరీష తెలిపారు. ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తగా పొదలను తొలగించినట్లు సర్పంచ్ పేర్కొన్నారు.
ఖలీల్‌వాడి: ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలని వెహికిల్ ఇన్‌స్పెక్టర్ కిరణ్‌కుమార్ అన్నారు. జిల్లా వినియోగదారుల సంఘాల సమైక్య ఆధ్వర్యంలో దుబ్బ ప్రభుత్వ పాఠశాల హైస్కూల్‌లో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కల్పించారు. అనంతరం పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో గుజరాజేశ్వరి, బీ లింగయ్య, శ్రీనివాసు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
లా అండ్ ఆర్డర్ పరిరక్షణకు కృషి చేయాలి
లా అండ్ ఆర్డర్ పరిరక్షణకు కృషి చేయాలి
లా అండ్ ఆర్డర్ పరిరక్షణకు కృషి చేయాలి


