ఘనంగా సావిత్రీబాయి ఫూలే జయంతి
సుభాష్‌నగర్/ మోపాల్/ జక్రాన్‌పల్లి/ ఇందల్వాయి/ ధర్పల్లి/ తెయూ(డిచ్‌పల్లి)/ నిజామాబాద్ లీగల్/ నిజామాబాద్ రూరల్/ సిరికొండ/ ఖలీల్‌వాడి/ నిజామాబాద్: గొప్ప సంఘ సంస్కర్త, ఉద్యమశీలి సావిత్రీబాయి ఫూలే అని పలువురు వక్తలు అన్నారు. నిజామాబాద్ అర్బన్, రూరల్ నియోజకవర్గాల్లో సావిత్రీబాయి ఫూలే జయంతిని ప్రజలు శనివారం ఘనంగా నిర్వహించారు. పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, స్వచ్ఛంద సంస్థల్లో ఆమె చిత్రపటానికి ఉపాధ్యాయులు, అధికారులు, నిర్వాహకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మహిళలు చదువును నిర్లక్ష్యం చేయొద్దని అధికారులు, ప్రజాప్రతినిధులు సూచించారు. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో విజేతలకు అధికారులు బహుమతులు అందజేశారు. పలు చోట్ల ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సావిత్రీబాయి ఫూలే చిత్రపటానికి న్యాయవాదులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సిరికొండ మండలం సత్యశోధక్ పాఠశాలలో నిర్వహించిన సావిత్రీబాయి ఫూలే జయంతి వేడుకలకు రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్‌బిన్ హందాన్ హాజరయ్యారు. పాఠశాలలో చదువు మధ్యలో మానేసిన పిల్లలు(డ్రాపవుట్స్) లేకుండా చూడాలని అన్నారు. అనంతరం ఉపాధ్యాయినులను సన్మానించారు.
ఘనంగా సావిత్రీబాయి ఫూలే జయంతి
ఘనంగా సావిత్రీబాయి ఫూలే జయంతి


