సెల్ ఫోన్‌కు దూరంగా ఉండాలి
సిరికొండ: విద్యార్థులు సెల్ ఫోన్‌కు దూరంగా ఉండాలని తెయూ వీసీ యాదగిరిరావు అన్నారు. రావుట్ల గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్థానికుడైన రాష్ట్ర ఉన్నత విద్యా మండలి మాజీ చైర్మన్ రిక్క లింబాద్రి తన తల్లి లక్ష్మి స్మారకార్ధంగా పదో తరగతిలో మంచి ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. అనంతరం పదోతరగతిలో ఉత్తమ ర్యాంకులు సాధించిన ఒరగంటి రాజేశ్వరి, మూత బిందుశ్రీ, కట్టాజీ రూపికకు నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. కార్యక్రమంలో డీఈవో అశోక్, సర్పంచ్ రాజ్‌కుమార్, ఉపసర్పంచ్ శ్రీనివాస్‌గౌడ్, ఎంఈవో రాములు, హెచ్‌ఎం శ్రీనివాస్, డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు బాలయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


