బోధన్‌లో ఒకే ఇంటిపై 10 ఓట్లు
బోధన్‌టౌన్(బోధన్): మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బోధన్ బల్దియా అధికారులు ప్రకటించిన ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున తప్పులు చోటు చేసుకున్నాయి. జాబితాపై వివిధ రాజకీ య పార్టీల నాయకులతోపాటు మాజీ కౌన్సిల ర్లు, పోటీ చేయనున్న ఆశావహులు అభ్యంతరా లు చెబుతున్నారు. 4వ వార్డులో ఒకే ఇంటిపై పది ఓట్లున్నాయి. ఇదేతరహాలో 37 వార్డులు ఉన్నా యని అధికారులకు వివరించారు. గత మున్సిపల్ ఎన్నికల్లో 38 వార్డుల్లో 62,448 ఓట్లు ఉండగా ప్రస్తుతం 69, 470 ఓట్లు ఉన్నాయి. 7,022 ఓటర్లు పెరిగారు. ఓటర్ల జాబితా డ్రాప్ట్‌లో మృతి చెందిన వారి ఓట్లు తొలగించలేదు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారి ఓట్లు నమోదు చేయలేదు. 4వ వార్డులో మృతి చెందిన మత్తడి పోచయ్య, పత్తి జగదాంబ, బైరి గంగవ్వ, స్వప్న, ఉమర్ ఖాన్‌లతోపాటు మరో ఐదుగురి పేర్లు ఓటరు జాబితాలో ఉన్నాయి. కాగా, ఓటర్ల ముసాయిదా జాబితాలో తప్పులను సవరించాలని ఇప్పటికే ప్రజలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు సబ్ కలెక్టర్‌ను కలిసి విన్నవించారు.


