అయోమయం.. | - | Sakshi
Sakshi News home page

అయోమయం..

Jan 4 2026 7:14 AM | Updated on Jan 4 2026 7:14 AM

అయోమయ

అయోమయం..

న్యూస్‌రీల్‌

నిజామాబాద్‌
కాంగి‘రేసు’లో

రబీ సాగుకు భరోసా!

పోచారం ప్రాజెక్టు ప్రస్తుతం నిండుకుండలా ఉంది. సాగునీటికి ఢోకా లేకపోవడంతో ఆయకట్టు రైతులు సాగుకు సిద్ధమవుతున్నారు.

వాతావరణం

దట్టంగా పొగమంచు కురుస్తుంది. ఈదురు గాలులు వీస్తాయి. ఆకాశం పాక్షికంగా మేఘావృతమవుతుంది. రాత్రి చలి తీవ్రత కొనసాగుతుంది.

రూ.లక్షలు వెచ్చించి..

భారీ వరద తాకిడికి కోతకు గురైన భూముల్లో తిరిగి పంటలను సాగు చేసేందుకు రైతులు రూ.లక్షలు ఖర్చు చేస్తున్నారు.

ఆదివారం శ్రీ 4 శ్రీ జనవరి శ్రీ 2026

– 8లో u

ఓటర్ల జాబితాలో హైదరాబాద్‌, ఇతర ప్రాంతాలకు చెందిన వాళ్ల ఓట్లు భారీగా చేరడం మీద చర్చ జరిగింది. తమ డివిజన్లలో తమకు తెలియకుండా బయటి వ్యక్తుల ఓట్లు ఎలా నమోదయ్యాయంటూ ఆయా డివిజన్ల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. ఇలా అయితే ఎంఐఎం, బీజేపీలను ఎదుర్కోవడం కష్టమేనని కొందరు అన్నట్లు తెలిసింది. కీలకమైన ఇలాంటి అంశాల మీద ఏమాత్రం గ్రౌండ్‌వర్క్‌ లేకుండా ముందుకు వెళితే కష్టమేనని పలు డివిజన్ల నాయకులు అన్నారు. రియల్‌ ఎస్టేట్‌, ఇతర దందాలు చేసుకుంటూ అంతా బాగుందనే నాయకుల కారణంగానే పార్టీలో పరిస్థితి గందరగోళంగా తయారైందని కొందరు అసహనం వెలిబుచ్చారు.

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: నగరపాలక ఎన్నికలకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న తరుణంలో నిజామాబాద్‌ నగర కాంగ్రెస్‌లో అయోమయ పరిస్థితి నెలకొంది. బీజేపీ, ఎంఐఎం ఎన్నికల బరిలో ఆధిపత్యం చాటుకునేందుకు ఇప్పటికే నగరంలో పకడ్బందీగా గ్రౌండ్‌ వర్క్‌ చేసుకుంటున్నాయి. అధికార కాంగ్రెస్‌లో మాత్రం సమన్వయం కుదరకపోవడంతో గందరగోళం నెలకొంది. శనివారం నగరపాలక ఎన్నికల విషయమై ఓటరు ముసాయిదా జాబితా పరిశీలన మీద నగర కాంగ్రెస్‌ సమావేశం జరిగింది. నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో బ్లాక్‌ అధ్యక్షుడు కేశ మహేశ్‌, అబుద్‌ బిన్‌ హందాన్‌, సేవాదళ్‌ బాధ్యులు పాల్గొన్నారు. అయితే ఇంకా నగర కమిటీ వేయకపోవడం, డివిజన్‌ కమిటీలు నియమించకపోవడంతో ఈ సమావేశంలో ఎవరికి వారే అన్నట్లుగా సాగింది. ఆయా డివిజన్లలో తమ పెత్తనమే సాగాలని కొందరు నాయకులు, పనిచేసిన తమకే టికెట్లు ఇవ్వాలని మరికొందరు నాయకులు డిమాండ్‌ చేశారు. కొత్త కమిటీ వేసేవరకు తమదే పెత్తనమని కొందరు చెప్పడంతో సమావేశంలో గలాటా జరిగింది. తమ ఆధ్వర్యంలోనే ఎన్నికలకు ముందుకెళ్లాలని కొందరు మాజీ కార్పొరేటర్లు అన్నారు. ఇదిలా ఉండగా కొందరు సీనియర్‌ కార్యకర్తలు మాత్రం కొత్తవారికి అధిక ప్రాధాన్యత ఇచ్చి తమకు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్లు ఇవ్వకపోతే బీజేపీ, ఎంఐఎం, బీఆర్‌ఎస్‌, జాగృతి పార్టీల్లోకి వెళ్లిపోతామని కొందరు సీనియర్‌ కార్యకర్తలు, నాయకులు తెగేసి చెప్పారు. మరికొందరు డివిజన్ల నాయకులు కొత్త కమిటీ వేసేవరకు తామే కొనసాగుతామని చెప్పడంతో గందరగోళ వాతావరణం నెలకొంది.

ఆర్మూర్‌: ఆర్మూర్‌ కాంగ్రెస్‌లో సీనియర్స్‌ వర్సెస్‌ జూనియర్స్‌ రగడ మళ్లీ ప్రారంభమైంది. మున్సి పల్‌ ఎన్నికలు నిర్వహించనుండటంతో ఆది నుంచి పార్టీ కోసం కష్టపడుతున్న సీనియర్‌ నాయకు లు తమ ఉనికిని కాపాడుకొనే ప్రయత్నాలు ప్రారంభించారు. అందులో భాగంగా పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి పొద్దుటూరి వినయ్‌రెడ్డికి సమాచారం ఇవ్వకుండా ఆర్మూర్‌ పట్టణంలో రహస్యంగా సమావేశమయ్యారు. ఎన్నికల్లో తమ భవితవ్యంపై ఘాటుగా చర్చించినట్లు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి వలస వచ్చిన వినయ్‌రెడ్డికి కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ కేటాయించింది. వినయ్‌రెడ్డి ఓటమిపాలైనప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడంతో నియోజకవర్గ ఇన్‌చార్జిగా హవా కొనసాగుతోంది. దీంతో ఆర్మూర్‌ మున్సిపల్‌ పాలకవర్గంతోపాటు పలు వురు బీఆర్‌ఎస్‌ నాయకులు కాంగ్రెస్‌లో చేరారు. జూనియర్లుగా చేరిన వీరందరికీ పీవీఆర్‌ వర్గంగా ముద్ర పడింది. అప్పటికే కాంగ్రెస్‌ పార్టీలో క్రియాశీలకంగా ఉన్న సీనియర్‌ నాయకులకు పీవీఆర్‌ వర్గానికి మధ్య మనస్పర్థలు తలెత్తుతూ వస్తున్నా యి. సీనియర్‌ నాయకులకంటే వినయ్‌రెడ్డి సమక్షంలో ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌ పార్టీలో చేరి న వారికే ప్రాధాన్యత లభిస్తోందనే అభద్రతా భావంతో సీనియర్లు క్రమంగా పార్టీ కార్యకలాపా లకు దూరమవుతూ వస్తున్నారు. మున్సిపల్‌ ఎన్నికలు రానుండటంతో అసంతృప్తితో ఉన్న సీనియర్‌ నాయకులు శనివారం సమావేశమై తమ భవితవ్యంపై చర్చించుకున్నారు. అందులో సు మారు 10 నుంచి 12 మంది కౌన్సిలర్లుగా పోటీ చేయడానికి ఆసక్తి చూపుతుండటంతో పార్టీలో త మ ప్రాధాన్యత గురించి వినయ్‌రెడ్డికి సమాచారం ఇవ్వాల్సిందిగా సమావేశానికి ఆర్మూర్‌ ఏఎంసీ చైర్మన్‌ సాయిబాబా గౌడ్‌ను సైతం పిలిపించారు. పార్టీ కోసం ఏళ్ల తరబడిగా కష్టపడుతున్న తమకు కౌన్సిలర్‌ టికెట్లు కేటాయించాలనే డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. ఇదే విషయమై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ను కలిసి విన్నవించడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు.

బయటి ఓట్ల నమోదు ఎలా!

నగరపాలక ఎన్నికల సన్నాహక

సమావేశంలో గందరగోళం

డివిజన్లలో పెత్తనం, టికెట్లపై ఎవరి వాదన వారిదే

కొత్తవారికి ప్రాధాన్యత

ఎందుకంటూ పాత

నాయకుల అసహనం

ఆర్మూర్‌లో సీనియర్స్‌ వర్సెస్‌ జూనియర్స్‌

పార్టీ ఇన్‌చార్జి వినయ్‌రెడ్డికి

సమాచారం లేకుండా సమావేశం

అయోమయం.. 1
1/4

అయోమయం..

అయోమయం.. 2
2/4

అయోమయం..

అయోమయం.. 3
3/4

అయోమయం..

అయోమయం.. 4
4/4

అయోమయం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement