లింబాద్రిగుట్టపై పారిశుద్ధ్యం కోసం ప్రత్యేక చర్యలు
మోర్తాడ్: లింబాద్రి గుట్ట జాతర, రథోత్సవం బుధవారం నిర్వహించనున్న నేపథ్యంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడానికి భీమ్‌గల్ మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలు సమన్వయంతో పని చేస్తూ, ప్రత్యేక చర్యలు చేపట్టాయి. మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్, ఎంపీడీవో సంతోష్‌కుమార్‌లు, పంచాయతీ కార్యదర్శులు, ఇతర ఉద్యోగులతో కలిసి గుట్టను మంగళవారం సందర్శించారు. చెత్తను ఎప్పటికప్పుడు ఎత్తి తరలించడానికి మున్సిపల్ ట్రాక్టర్లతోపాటు మండలంలోని వివిధ పంచాయతీల ట్రాక్టర్లను ఏర్పాటు చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడానికి సిబ్బంది రాత్రింబవళ్లు పని చేస్తారని అధికారులు వెల్లడించారు.
సిరికొండ: భీంగల్‌లోని ప్రొహిబిషన్ ఎకై ్సజ్ కార్యాలయంలో వివిధ కేసులలో పట్టుబడిన రెండు ద్విచక్ర వాహనాలను బుధవారం వేలం వేస్తున్నట్లు ఎ
కై ్సజ్ సీఐ వేణుమాధవరావు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రొహిబిషన్ ఎకై ్సజ్ అధికారి ఆదేశాల మేరకు ఈ వేలంపాట నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆసక్తి గల వారు భీంగల్‌లోని కార్యాలయానికి ఉదయం 11 గంటలకు హాజరు కావాలని సీఐ కోరారు.
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: కేబినెట్ హోదాతో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి మంగళవారం హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తన నియామకంపై ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం సుదర్శన్‌రెడ్డికి ఆమె అభినందనలు తెలిపారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్‌బిన్ హందాన్, పారుపల్లి గంగారెడ్డి ఉన్నారు.
లింబాద్రిగుట్టపై పారిశుద్ధ్యం కోసం ప్రత్యేక చర్యలు


