నగర మార్కెట్‌లో ‘కార్తీక’ సందడి
నిజామాబాద్ రూరల్: నగర మార్కెట్‌లో కార్తీక పౌ ర్ణమి సందడి నెలకొంది. ప్రతీ కార్తీక పౌర్ణమి రోజు న మహిళలు తులసీ గద్దెలకు పందిరి వేసి పూలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించి, కార్తీక దీ పాలు వెలిగిస్తారు. అనంతరం ముత్తైదువులకు వా యినాలు ఇచ్చి, వారి ఆశ్వీర్వాదం తీసుకుంటారు. ఈక్రమంలో తులసీ పూజకు కావాల్సిన సామగ్రి కో సం ప్రజలు జిల్లాకేంద్రానికి మంగళవారం భారీగా తరలివచ్చారు. దీంతో పూలు, పండ్లు, ఉసిరిగాయ లు, ఉసిరిచెట్లకు, మామిడికొమ్మలకు గిరాకీ పెరిగింది. నగరంలోని ప్రధాన చౌరస్తాల్లో ప్రత్యేక దుకాణాలను ఏర్పాటు చేయగా, కొనుగోలుదారులతో దారులన్నీ కిటకిటలాడాయి.
ముస్తాబైన ఆలయాలు..
నగరంలోని నీలకంఠేశ్వరాలయం, శంభులింగేశ్వర ఆలయం, మార్కండేయ మందిరంలో కార్తీక పౌ ర్ణమి వేడుకలకు ముస్తాబయ్యాయి. నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాస చతుర్దశిని పురస్కరించుకొని జ్వాలాతోరణం నిర్వహించారు.
నగర మార్కెట్‌లో ‘కార్తీక’ సందడి
నగర మార్కెట్‌లో ‘కార్తీక’ సందడి


