హెల్మెట్‌ ఆవశ్యకతపై షార్ట్‌ ఫిల్మ్‌ | - | Sakshi
Sakshi News home page

హెల్మెట్‌ ఆవశ్యకతపై షార్ట్‌ ఫిల్మ్‌

Nov 5 2025 7:23 AM | Updated on Nov 5 2025 7:23 AM

హెల్మెట్‌ ఆవశ్యకతపై షార్ట్‌ ఫిల్మ్‌

హెల్మెట్‌ ఆవశ్యకతపై షార్ట్‌ ఫిల్మ్‌

చిత్రీకరించిన ఏర్గట్ల ఎస్సై రాజేశ్వర్‌

ఆవిష్కరించిన సీపీ సాయిచైతన్య

మోర్తాడ్‌(బాల్కొండ): ద్విచక్ర వాహనం నడిపేవారికి హెల్మెట్‌ ఆవశ్యకతను తెలియజేస్తూ ఏర్గట్ల ఎస్సై పడాల రాజేశ్వర్‌ షార్ట్‌ ఫిల్మ్‌ను రూపొందించారు. హెల్మెట్‌ ధరిస్తే ఎంత మేలు జరుగుతుందో అందరికి అర్థమయ్యేలా ఎస్సై స్వీయ నిర్మాణంలో స్థానిక ప్రైవేటు పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థుల సహకారంతో 5 నిమిషాల నిడివిగల షార్ట్‌ ఫిల్మ్‌ను రూపొందించారు. హెల్మెట్‌ వినియోగంపై చిన్నారులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తే వారి ఇంట్లోని వారు బైక్‌లపై ఎటూ వెళ్లినా హెల్మెట్‌ ధరిస్తారని దీనివల్ల ప్రాణాపాయం లేకుండా చేయవచ్చని ఎస్సై తెలిపారు. ఆయన రూపొందించిన ఈ షార్ట్‌ ఫిల్మ్‌ను ఇటీవల సీపీ సాయి చైతన్య ఆవిష్కరించి, ఎస్సై చూపిన చొరవను అభినందించారు. హెల్మెట్‌ అనే టైటిల్‌తో ఉన్న ఈ షార్ట్‌ ఫిల్మ్‌ సామాజిక మాధ్యమాలలో వైరల్‌ అవుతుండటం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement