క్రైం కార్నర్
రోడ్డు ప్రమాదంలో భర్త మృతి : భార్యకు గాయాలు
బాన్సువాడ రూరల్: కామారెడ్డి జిల్లా బా న్సువాడ మండలంలోని కొయ్యగుట్ట తండా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్త మృతి చెంద గా, భార్య తీవ్ర గాయాలపాలయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా నాగధార్ మండలం గరుకుచెట్టుతండాకు చెందిన కెతావత్ వసూరాం (52), తన భార్య దూరిబాయితో కలిసి టీవీఎస్ ఎక్సెల్‌పై మంగళవారం కామారెడ్డి వైపు బయలుదేరారు. కొయ్యగుట్ట తండా మూలమలుపు వద్ద వారి వాహనాన్ని ఓ కారు ఎదురుగా వేగంగా వచ్చి ఢీకొట్టింది. అనంతరం కారు స్తంభాన్ని ఢీకొట్టి నిలి చిపోయింది. ఈ ఘటనలో వసూరాం అక్కడికక్కడే మృతి చెందాడు. దూరిబా యి తీవ్రంగా గాయపడగా, బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కే సు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తుల శ్రీధర్ తెలిపారు.
గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
నందిపేట్(ఆర్మూర్): మండలంలోని బజార్ కొత్తూర్ గ్రామ సమీపంలో మంగళవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమయినట్లు ఎస్సై శ్యాంరాజ్ తెలిపారు. బజార్ కొత్తూర్ గ్రామ శివారులో మంగళవారం ఉదయం ఓ వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వారు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. అతడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేవని పోలీసులు పేర్కొన్నారు. మృతుడి వయస్సు సుమారు 35 నుంచి 40 ఏళ్లు ఉంటాయని అన్నారు. మృతుడు బ్లూ, రెడ్, వైట్ కలర్ చెక్స్ షర్ట్, బ్లూ కలర్ షార్ట్ ధరించాడన్నాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
క్రైం కార్నర్
క్రైం కార్నర్


