యువత ఆదర్శవంతంగా ఎదగాలి | - | Sakshi
Sakshi News home page

యువత ఆదర్శవంతంగా ఎదగాలి

Nov 5 2025 7:23 AM | Updated on Nov 5 2025 7:23 AM

యువత ఆదర్శవంతంగా ఎదగాలి

యువత ఆదర్శవంతంగా ఎదగాలి

నిజామాబాద్‌ నాగారం: యువత చెడు మార్గంలో పయనించకుండా దేశానికి ఆదర్శవంతంగా ఎదగా లని అదనపు కలెక్టర్‌ కిరణ్‌ కుమార్‌ అన్నారు. నగరంలోని న్యూ అంబేడ్కర్‌ భవన్‌లో మంగళవారం జిల్లాస్థాయి యువజన ఉత్సవ పోటీలు జిల్లా యు వజన క్రీడల అధికారి పవన్‌ కుమార్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి కిరణ్‌ కుమార్‌ హాజ రై, మాట్లాడారు. జిల్లాస్థాయి పోటీలలోని విజేతలు రాష్ట్ర స్థాయిలో కూడా అదే ప్రతిభను కనబర్చాలన్నారు. అనంతరం విజేతలకు పవన్‌ కుమార్‌ బ హుమతులు ప్రదానం చేశారు. న్యాయనిర్ణే తలుగా సిర్ప లింగం, ఉమాబాల, పాయల్‌, భుజంగం, కా సర్ల నరేష్‌, నాగరాజు, పుష్పలత, శ్వేతరెడ్డి, ప్రశాంత్‌, సురేష్‌, గంగాదాస్‌ పాల్గొన్నారు.

విజేతలు వీరే: జానపద నృత్యం (గ్రూప్‌)– శైలజ, జానపద గీతం (గ్రూప్‌)– హరిత, కథ రచన– అమేయ, ద్వితీయ–శ్రీనిధి, పెయింటింగ్‌–వేణు కుమార్‌, ద్వితీయ–పూజ, డిక్లమేషన్‌/ఎల్యుకేషన్‌–ధరణి, ద్వితీయ –అయిష బేగం, కవిత్వ రచన – శ్రేష్ఠ, ద్వితీయ– అక్షర, ఇన్నోవేషన్‌ –విజితెంద్రియ, ఎ.రాజ్‌ కరణ్‌, ద్వితీయ– సిద్దు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement