ఉత్తమ ఫలితాలకు కసరత్తు | - | Sakshi
Sakshi News home page

ఉత్తమ ఫలితాలకు కసరత్తు

Nov 3 2025 7:22 AM | Updated on Nov 3 2025 7:22 AM

ఉత్తమ ఫలితాలకు కసరత్తు

ఉత్తమ ఫలితాలకు కసరత్తు

రోజుకో సబ్జెక్టు టీచర్‌.. మూడు కేటగిరిల ఏర్పాటు..

ప్రత్యేక అభ్యాస దీపిక..

ఖలీల్‌వాడి : పదో తరగతిలో ఉత్తమ ఫలితాల సాధనకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. టీచర్ల బోధన, పరీక్షలపై దృష్టి సారించింది. ప్రతి సబ్జెక్టులో విద్యార్థులు పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యేలా కార్యాచరణ అమలు చేస్తోంది. గతేడాది ప్రత్యేక తరగతులు, పరీక్షలు, ప్రీఫైనల్‌తోపాటు పదో తరగతి పరీక్షలపై అవగాహన కల్పించేందుకు అదనంగా పరీక్ష (గ్రాండ్‌ టెస్ట్‌) నిర్వహించారు. అయితే, ఈసారి మరింత మెరుగైన ఫలితాలు సాధించేందుకు ముందుగానే ప్రత్యేక తరగతులకు రూపకల్పన చేశారు. సాధారణ బోధనతోపాటు సాయంత్రం వేళల్లో అదనంగా ఒక గంట ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు.

జిల్లాలో 342 జడ్పీ, ప్రభుత్వ పాఠశాలలు ఉండగా అందులో 12,722 మంది పదో తరగతి విద్యార్థులు చదువుతున్నారు. జిల్లా వ్యాప్తంగా అక్టోబర్‌ 6 నుంచి ప్రత్యేక తరగతులు ప్రారంభించారు. ప్రస్తుతం ఎస్‌ఏ (సమ్మెటీవ్‌ అసెస్‌మెంట్‌) పరీక్షలు జరుగుతున్నాయి. ఇందులో పదో తరగతి విద్యార్థులు సైతం పరీక్షలు రాస్తున్నారు. అయితే, రోజు ఉదయం 9.15 నుంచి సాయంత్రం 4.15 వరకు పాఠశాల పని చేస్తుండగా.. ప్రత్యేక ప్రణాళికలో భాగంగా సాయంత్రం 4.15 నుంచి 5.15 వరకు గంటపాటు తరగతులు నిర్వహిస్తున్నారు. అందుకోసం రోజుకో సబ్జెక్ట్‌ టీచర్‌ చొప్పున సాయంత్రం వేళల్లో ఆయా సబ్జెక్టుల్లో విద్యార్థులకు మరింత అవగాహన కల్పిస్తూనే వెనుకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తూ పరీక్షలు సిద్ధం చేస్తున్నారు.

సంవత్సరం పరీక్ష రాసిన ఉత్తీర్ణులైనవారు ఉత్తీర్ణత జిల్లా ర్యాంకు

విద్యార్థులు శాతం

2021–2022 22243 20651 92.84 18

2022–2023 21592 18810 87.12 21

2023–2024 21858 20486 93.72 14

2024–2025 22694 21928 96.62 16

ఈ ఏడాది ఉత్తమ ఫలితాల సాధన కోసం ఇప్పటి నుంచే కార్యాచరణ ప్రారంభించాం. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి మార్పు తెచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. పాఠ్యప్రణాళికను పక్కాగా బోధించడంతోపాటు ప్రత్యేక తరగతులను పకడ్బందీగా అమలు చేస్తున్నాం. ఎస్‌ఏ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా విద్యార్థులను మూడు కేటగిరీలుగా ఏర్పాటు చేస్తాం. దీంతో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు వెసులుబాటు కలుగుతుంది.

– పార్శి అశోక్‌,

డీఈవో, నిజామాబాద్‌

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పదో తరగతి విద్యార్థులు పాఠాలు సులభంగా అర్థం చేసుకునేలా ప్రత్యేక అభ్యాస దీపికలను విద్యాశాఖ సిద్ధం చేసింది. ఇందులో గణితం, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలాజీ, సోషల్‌ వంటి వాటిని రూపొందించారు. వీటిని పాఠశాలలకు అందజేసినట్లు తెలుస్తోంది. పదో తరగతి పరీక్షలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు అవసరమైన పద్ధతులను అభ్యాస దీపికలో వివరించారు.

పదో తరగతి విద్యార్థులకు

ప్రత్యేక తరగతులు

ప్రతిరోజు సాయంత్రం అదనంగా

గంటపాటు క్లాసుల నిర్వహణ

ఉత్తీర్ణత శాతం పెరుగుదలకు విద్యాశాఖ కసరత్తు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement