పరాజయాల నుంచి విజయం వస్తుందని మన మహిళా జట్టును చూస్తే అర్థమవుతోంది. టోర్నీ ప్రారంభంలో అద్భుతంగా రాణించి, మధ్యలో ఒడిదుడుకులు ఎదురైనా అందరూ సమష్టిగా రాణించి విజేతలుగా నిలిచారు.
– దుబాక హాసిని, వికెట్ కీపర్
మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్స్‌లో సౌతాఫ్రికాజట్టుతో పోరాడిన భారత జట్టు విజేతగా నిలవడంతో జిల్లా క్రీడాభిమానుల ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. 47 ఏళ్లుగా ట్రోఫీ కోసం కలలు కంటూనే ఉన్న క్రీడాభిమానులు సంబురాల్లో మునిగి తేలారు. భారతజట్టు రెండుసార్లు ఫైనల్స్‌కి వెళ్లినప్పటికీ రన్నర్‌గానే నిలిచింది. మూడోసారి ఫైనల్‌కి వెళ్లగా జట్టు క్రీడాకారిణులు సత్తాచాటి చాంపియన్‌లుగా నిలిచారు. భారత మహిళా జట్టు వన్డే ప్రపంచకప్ సాధించడంపై పలువురు క్రీడాకారిణులు తమ అభిప్రాయాలు పంచుకున్నారిలా.. – నిజామాబాద్ నాగారం
వరల్డ్ కప్‌లో రాణించడం చాలా కష్టం. ఈసారి ఎలాగైనా కప్పు కొట్టాలని పక్కా ప్రణాళికతో మన జట్టు సభ్యులు రాణించారు. జట్టును ప్రపంచ విజేతగా నిలిపి అందరి హృదయాలను గెలిచారు.
– టి హర్షిణి, ఆల్ రౌండర్
రెండుసార్లు ఫైనల్స్‌కి వెళ్లినప్పటికీ రన్నర్‌గానే మిగిలిపోవడం ఒకింత నిరాశకు గురి చేసింది. మూడోసారి ఫైనల్స్‌కు వెళ్లిన జట్టును క్రీడాకారిణులు తమ దృఢసంకల్పంతో గెలిపించారు. చాంపియన్‌లుగా నిలిచారు. – సాన్విరెడ్డి, ఆల్ రౌండర్
ప్రపంచ కప్ వన్డే టోర్నమెంట్‌లో భారత మహిళా జట్టు రాణించడం అభినందనీయం. ఎన్నో ఏళ్లుగా ట్రో ఫీని కై వసం చేసుకోవడానికి శ్రమిస్తున్నారు. ఎట్టకేలకు క్రీడాకారుల కల నెరవేరడం సంతోషం. – హేమలత,
అండర్–19 క్రికెట్ క్రీడాకారిణి
మహిళల వన్డే ప్రపంచ కప్ కై వసం
కప్పుకొట్టి సత్తా చాటిన
భారత జట్టు క్రీడాకారిణులు
రెండుసార్లు ఫైనల్స్ పోరాడి
ఓడిన మహిళా జట్టు
హర్షం వ్యక్తం చేస్తున్న
జిల్లా క్రీడాభిమానులు..
పలుచోట్ల సంబురాలు
సమష్టిగా రాణించారు
సమష్టిగా రాణించారు
సమష్టిగా రాణించారు
సమష్టిగా రాణించారు


