నిజామాబాద్
న్యూస్‌రీల్
లక్ష్యానికి మించి విద్యుదుత్పత్తి
సోమవారం శ్రీ 3 శ్రీ నవంబర్ శ్రీ 2025
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ జల విద్యుదుత్పత్తి కేంద్రం లక్ష్యానికి మించి విద్యుత్ ఉత్పత్తి సాధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 67 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తిని లక్ష్యంగా జలసౌధ విధించగా, ఇప్పటి వరకు 67.40 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి జరిగింది. దీంతో జెన్‌కో అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జల విద్యుదుత్పత్తి కేంద్రంలో నాలుగు టర్బయిన్‌లు ఉన్నాయి. ఒక్కో టర్బయిన్ ద్వారా 9 మెగావాట్ల చొప్పున 36 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేపట్టే సామర్థ్యం ఉంది. కానీ ప్రస్తుత సంవత్సరం సామర్థ్యానికి మించి 36.5 మెగావాట్ల విద్యుదుత్పత్తి వరకు జరిగింది. ప్రాజెక్ట్ నీటిమట్టం నిండుకుండలా ఉండటంతోపాటు నీరు వేగంగా రావడం ద్వారా సామర్థ్యానికి మించి విద్యుదుత్పత్తి సాధ్యమైంది. ప్రస్తుతం రోజుకు 0.87 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి జరుగుతుంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి జల విద్యుదుత్పత్తి అనంతరం ఎస్కెప్ గేట్ల ద్వారా నిరంతరం విద్యుదుత్పత్తి జరుగుతుంది. గతంలో కేంద్రం విద్యుదుత్పత్తి లక్ష్యం 90 మిలియన్ యూనిట్లుగా ఉండేది. కానీ కాలక్రమేణ లక్ష్యాన్ని అధికారులు తగ్గిస్తూ వస్తున్నారు.
నిజామాబాద్


