జోరువానలో పథ సంచలన్
సుభాష్‌నగర్ : ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాలలో భాగంగా కోటగల్లి ఉపనగర శాఖ స్వయం సేవకులు ఆదివారం పట్టణంలో పథ సంచలన్ నిర్వహించారు. కోటగల్లి మార్కండేయ మందిరం నుంచి శివాజీనగర్, పెద్దబజార్, కసాబ్‌గల్లి, గోల్ హనుమాన్, జండా బాలాజీ మందిరం మీదుగా తిరిగి మార్కండేయ మందిరం వరకు కార్యక్రమం సాగింది. భారీ వర్షంలోనూ స్వయం సేవకులు ఈ పథ సంచలన్‌లో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ నగర కార్యవాహ సత్యం, సహ కార్యవాహలు సుమిత్, వెంకటేశ్, ఉపనగర కార్యవాహలు భార్గవ్, రామకృష్ణ, దత్తు, రామన్న తదితరులు పాల్గొన్నారు.
జోరువానలో పథ సంచలన్
జోరువానలో పథ సంచలన్
జోరువానలో పథ సంచలన్


