
సాలూర ఎత్తిపోతలకు పూర్వవైభవం
బోధన్ : మంజీర నదిపై సాలూర గ్రామ శివారులో నిర్మించిన ఎత్తిపోతల పథకం ఎట్టకేలకు పునః ప్రా రంభమైంది. సొసైటీ చైర్మన్ అల్లె జనార్దన్, డైరెక్ట ర్లు, కమిటీ సభ్యులతో కలిసి ఎత్తిపోతల పథకం ని ర్వహణ కమిటీ చైర్మన్ శివకాంత్ పటేల్ ఆదివారం పథకం మోటార్లను ప్రారంభించి నీటిని విడుదల చేశారు. కమిటీ ప్రతినిధులు డిస్కో సాయిలు, ఇల్తె పు సాయన్న, గ్రామ పెద్దలు ఇల్తెపు శంకర్, గాండ్ల పెద్ద రాజేశ్వర్, కండెల సంజీవ్, ముట్టెన్ గంగా రాం, కేజీ గంగారాం రైతులు పాల్గొన్నారు.
సామగ్రి చోరీతో మూతపడి..
ప్రతియేటా వర్షాకాలం ప్రారంభంలోనే మంజీర న దిలోకి నీటి ప్రవాహం ప్రారంభంకాగానే ఎత్తిపోత ల పథకం మోటార్లను ప్రారంభించి ఎత్తిపోసిన నీ టిని చెరువుల్లో నింపుకుని అవసరాల మేరకు పంట ల సాగుకు ఉపయోగించుకుంటారు, కానీ ప్రస్తుత సంవత్సరం ఎత్తిపోతల పథకం ప్రధాన పంప్‌హౌజ్‌లో ఎలక్ట్రికల్ ప్యానెల్ బోర్డు, ఇతర సామగ్రిని గుర్తుతెలియని వ్యక్తులు దొంగలించారు. దీంతో ని ర్వహణ కమిటీ వద్ద నిధులు లేక మరమ్మతులు చే పట్టకపోవడంతో పథకం నిరూపయోగంగా మారింది. రెండు నెలల క్రితం పథకం పునః ప్రారంభించేందుకు గ్రామ ప్రజాప్రతినిధులు, ఆయకట్టు రైతులు సమావేశమై చర్చించారు. నూతన కమిటీని ఎన్ను కొని, మరమ్మతుల ఖర్చును అంచనా వేశారు. సొ సైటీ చైర్మన్ అల్లె జనార్దన్, పలువురు రైతులు ఆర్థిక సహకారం అందించడంతో మరమ్మతులు చేపట్టా రు. పథకం పునః ప్రారంభంతో పంటల సాగుకు భరోసా ఏర్పడిందని రైతులు పేర్కొంటున్నారు.
రైతులు చెల్లించాల్సిన పన్ను బకాయిలు సకాలంలో చెల్లించి సహకరించాలి. ఎత్తిపోతల పథకం ద్వారా పంటల సాగుకు నీరందించేందుకు ప్రయత్నాలు చేశాం. నిరంతరాయంగా ఎత్తిపోతల పథకం నిర్వహణకు ఆర్థిక వనరులు సమకూర్చుకుంటేనే సాధ్యమవుతుంది. – శివకాంత్ పటేల్,
ఎత్తిపోతల పథకం నిర్వహణ కమిటీ చైర్మన్