పోలీసుల అదుపులో రియాజ్‌ | - | Sakshi
Sakshi News home page

పోలీసుల అదుపులో రియాజ్‌

Oct 20 2025 9:24 AM | Updated on Oct 20 2025 9:24 AM

పోలీసుల అదుపులో రియాజ్‌

పోలీసుల అదుపులో రియాజ్‌

ఎన్‌కౌంటర్‌ వదంతులు వీడియో వైరల్‌ తీవ్రంగా గాలించిన ప్రత్యేక బృందాలు

భద్రత నడుమ ఆస్పత్రికి..

నిజామాబాద్‌అర్బన్‌ : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సీసీఎస్‌ కానిస్టేబుల్‌ ప్రమోద్‌ హత్యకేసులో నిందితుడైన పాతనేరస్తుడు రియాజ్‌ పోలీసులకు ఆదివారం చిక్కాడు. బైక్‌ చోరీ కేసులో శుక్రవారం రాత్రి అరెస్టు చేసి తీసుకొస్తుండగా కత్తితో దాడి చేసి కానిస్టేబుల్‌ ప్రమోద్‌ను హత్య చేసి పరారయ్యాడు. నిందితుడిని పట్టుకునేందుకు సీపీ సాయిచైతన్య ఎనిమిది బృందాలను రంగంలోకి దింపారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు సారంగాపూర్‌ ప్రాంతంలో ఓ లారీ విడిభాగమైన క్యాబిన్‌లో రియాజ్‌ దాక్కున్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ప్రత్యేక బృందాలు బైకులపై అక్కడికి చేరుకోగానే గమనించిన రియాజ్‌ పారిపోతుండగా పోలీసులు వెంబడించారు. అదే సమయంలో రియాజ్‌ను పట్టుకునేందుకు ఆసిఫ్‌ అనే యువకుడు ప్రయత్నించగా అతడిపై గాజు ముక్కతో దాడి చేశాడు. అప్పటికే పోలీస్‌ బృందాలు రియాజ్‌ను చుట్టుముట్టాయి. నిందితుడిని పట్టుకునే క్రమంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

రియాజ్‌ను సారంగాపూర్‌ ప్రాంతంలో పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారని ఆదివారం మధ్యాహ్నం వదంతులు వ్యాపించాయి. అయితే రియాజ్‌ తమ అదుపులోనే ఉన్నాడని, ఎన్‌కౌంటర్‌ చేయలేదని సీపీ సాయి చైతన్య ప్రకటన విడుదల చేయడంతో వదంతులకు పుల్‌స్టాప్‌ పడింది.

రియాజ్‌ను అదుపులోకి తీసుకున్న సమయంలో అదే ప్రాంతంలో ఒకరు తీసిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యింది. నిందితుడి వద్ద కత్తి ఉందనే అనుమానంతో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అదుపులోకి తీసుకున్నారు. తుపాకులతో గురిపెట్టి నేలపై పడుకోబెట్టి, అనంతరం బేడీలు వేసి, తాళ్లతో కట్టేసి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

శుక్రవారం రాత్రి నుంచి 8 ప్రత్యేక బృందాలు రియాజ్‌ కోసం తీవ్రంగా గాలించాయి. నిందితుడు మొదట జిల్లా దాటినట్లు భావించినప్పటికీ సరిహద్దు ప్రాంతాలను పరిశీలించిన అనంతరం నగరంలోనే ఉన్నట్లు నిర్దారణకు వచ్చా రు. రియాజ్‌ పాతనేరస్తుడు కావడంతో అతడు తరచూ తిరిగే ప్రాంతాలు, కలిసే వ్యక్తులపై పో లీసులు నిఘా సారించి ఫోన్‌ నంబర్‌ను ట్రేసింగ్‌లో పెట్టారు. కానీ రియాజ్‌ ఫోన్‌ ఉపయోగించకుండా చోరీ చేసిన బైకుతో పోలీసుల కన్నుగప్పి వివిధ ప్రాంతాలు తిరిగాడు. బర్కత్‌పురా లోని ఓ లాయర్‌ వద్దకు వెళ్లిన రియాజ్‌ అతడి ద్వారా లొంగిపోయేందుకు ప్రయత్నించినప్పటికీ సదరు లాయర్‌ సాయం చేసేందుకు నిరాకరించినట్లు సమాచారం.

నిందితుడు రియాజ్‌కు దెబ్బలు తగలడంతో ప్రభుత్వ ఆస్పత్రిలోని ఖైదీలకు వైద్యం అందించే వార్డులో ఉంచారు. మొదట ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ప్రాథమిక చికిత్స చేశారు. ప్రస్తు తం రియాజ్‌ ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. నిందితుడిని పట్టుకునే ప్రయత్నంలో గాయలపాలైన ఆసిఫ్‌ను పోలీసులు ప్రభు త్వ జనరల్‌ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆసిఫ్‌ పరిస్థితి నిలకడగా ఉంది.

సారంగాపూర్‌ ప్రాంతంలో

పట్టుకున్న ప్రత్యేక బృందాలు

అడ్డుకున్న స్థానిక యువకుడిపై

కత్తితో దాడి చేసిన నిందితుడు

వదంతులు నమ్మొద్దు :

సీపీ సాయి చైతన్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement