
శనివారం రాత్రి చిక్కినట్టే చిక్కి..
రియాజ్ శనివారం రాత్రి పోలీసులకు చిక్కి నట్టే చిక్కి తప్పించుకున్నాడు. రాత్రి 8 గంటల ప్రాంతంలో బర్కత్‌పురాలో బైక్‌పై తి రుగుతున్న నిందితుడిని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. అ నంతరం పోలీసుల సూచనతో ఇద్దరు యు వకులు రియాజ్‌ను అనుసరించారు. బర్కత్‌పుర నుంచి ఆర్టీసీ బస్టాండ్ వ రకు, అనంతరం బస్టాండ్ వెనుక వైపు నుంచి మార్కెట్ యార్డు, అర్సపల్లి మీదుగా మ ళ్లీ సారంగాపూర్‌కు చేరుకున్నాడు. సారంగాపూర్ వద్ద కు రాగానే తనను అనుసరిస్తున్న యువకులను గమనించిన రియాజ్ కెనాల్ కట్ట వైపు వెళ్లాడు. అటు నుంచి నాలుగో టౌ న్ ఎస్సై శ్రీకాంత్, మరో ఇద్దరు బైక్‌పై రియాజ్‌ను వెంబడించారు. పోలీసులను చూసిన రి యాజ్ నిజాంసాగర్ కెనాల్ వైపు వేగంగా వెళ్లాడు. అనంతరం బైక్ పైనుంచి కాలువ లో దూకి, అక్కడి నుంచి పరారయ్యా డు. అదే సమయంలో పోలీసులు రియాజ్‌పై రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. కానీ, కాలువలో దూకడంతో ఆచూకీ లభించలే దు. అదే ప్రాంతంలో ఆరు ప్రత్యేక బృందా లు తీవ్రంగా గాలించగా, చీకటి ఉండటంతో పోలీసులు గుర్తించలేకపోయారు.