
జిల్లా ప్రజలకు కలెక్టర్ దీపావళి శుభాకాంక్షలు
నిజామాబాద్ అర్బన్: దీపావళి పండగను పురస్కరించుకొని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్ర జలందరి జీవితాల్లో కష్టాల కారుచీకట్లు తొ లగిపోయి, చిరుదివ్వెల వెలుగుల మాదిరి అనునిత్యం సుఖసంతోషాలతో విలసిల్లాల ని ఆకాంక్షించారు. ప్రమాదాలకు ఆస్కారం లేకుండా తగిన జాగ్రత్తలు పాటిస్తూ, ఇంటిల్లిపాది ఆనందంగా దీపావళి వేడుకలను జరుపుకోవాలని అభిలషించారు.
వైన్ షాపులకు దరఖాస్తు గడువు పెంపు
నిజామాబాద్ అర్బన్ : వైన్‌షాపులకు నూత న లైసెన్సుల కేటాయింపు కోసం దరఖాస్తు గడువును పెంచినట్లు ఎకై ్సజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 18వ తేదీతో గడువు ముగిసినప్పటికీ ఆ రోజున బీసీ బంద్ కారణంగా చాలా మంది దరఖాస్తు చేసుకోలేకపోయారని, దీ నిని దృష్టిలో ఉంచుకుని 23వ తేదీ వరకు గడువును పొడించామని పేర్కొన్నారు. 27వ తేదీన భారతీగార్డెన్‌లో ఉదయం 11 గంటలకు లక్కీ డ్రా తీస్తామని తెలిపారు. 18వ తేదీ నాటికి మొత్తం 2633 దరఖాస్తులు అందగా, నిజామాబాద్ స్టేషన్ ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో 908, బోధన్ 427, ఆర్మూర్ 572, భీమ్‌గల్ 355, మోర్తాడ్ స్టేషన్ పరిధిలో 366 దరఖాస్తులు అందాయని వివరించారు.
23న ఉమ్మడి జిల్లా ఖోఖో జట్ల ఎంపికలు
నిజామాబాద్ నాగారం : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని డిగ్రీ కాలేజ్ గ్రౌండ్‌లో ఈనెల 23న ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సీనియర్ మెన్ అండ్ ఉమెన్ జట్ల ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు ఆర్గనైజింగ్ ప్రతినిధులు ఆదివారం తెలిపారు. ఆసక్తిగల క్రీడాకారులు అదేరోజు గురువారం ఉదయం 9గంటలలోపు తమ సర్టిఫికెట్లు, జిరాక్స్‌లతోపాటు నాలుగు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకొని ఆర్గనైజింగ్ సెక్రెటరీ నాగేశ్వరరావుకి రిపోర్ట్ చేయాలన్నారు. పోటీల్లో ప్రతిభ చూపిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు పంపిచనున్నట్లు పేర్కొన్నారు. అంతకుముందు క్రీడాకారులకు ఈనెల 25 నుంచి నవంబర్ 5 వరకు పిట్లంలో శిక్షణ శిబిరం నిర్వహిస్తామన్నారు. మరిన్ని వివరాలకు 85559 96271, 94942 59901, 96762 69988 ను సంప్రదించాలన్నారు.
ఎస్సారెస్పీలోకి స్వల్పంగా
పెరిగిన వరద
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి ఎగు వ ప్రాంతాల నుంచి ఇన్‌ఫ్లో స్వల్పంగా పెరిగింది. క్రితం రోజు 5,654 క్యూసెక్కులు వ చ్చిన వరద ఆదివారం 9,654 క్యూసెక్కుల కు పెరిగింది. దీంతో ఎస్కేప్ గేట్ల ద్వారా గోదావరిలోకి 3 వేల క్యూసెక్కుల నీటి విడుదల ప్రారంభించారు. ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువ ద్వారా 5 వేల క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 650, లక్ష్మి కాలువ ద్వారా 200, మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా, ఆవిరి రూపంలో 573 క్యూసెక్కులు పోతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 (80.5 టీఎంసీలు) అడుగులు కాగా ఆదివారం సాయంత్రానికి అంతేస్థాయి నీటిమట్టంతో ప్రాజెక్ట్ నిండుకుండలా ఉందని అధికారులు పేర్కొన్నారు.