
ఒక్కో ధర
కోటి వెలుగుల
దీపావళి
ఒక్కో సర్వే నంబర్‌కు
లక్ష్మీదేవి చిత్రపటాలు..
దీపెంతలు, బొమ్మలు కొనుగోలు చేస్తున్న మహిళలు
మోర్తాడ్(బాల్కొండ): ఆర్మూర్ నుంచి కమ్మర్‌పల్లి శివారు వరకు నేషనల్ హైవే 63 విస్తరణ, అవసరం ఉన్న చోట్ల బైపాస్ రోడ్ల నిర్మాణానికి జిల్లాలో 83.895 హెక్టార్ల భూమి అవసరం ఉంటుందని అధికారులు గుర్తించారు. అయితే భూ సేకరణ కోసం నోటిఫికేషన్ జారీ చేసిన అధికారులు ఒక్కో సర్వే నంబర్ భూమికి ఒక్కో ధర నిర్ణయించారు. దొన్కల్ రెవెన్యూ శివార్లలోని 502/1ఎఫ్‌బీ సర్వే నంబర్‌లో ఎకరానికి రూ.1,14,31,384 ధరను, దాని పక్కనే ఉన్న 500/3 సర్వే నంబర్‌లోని భూమికి రూ.60,54,604 ధరను అవార్డుగా ప్రకటించారు. ఇదే వరుసలో ఉన్న 377/2ఏ సర్వే నంబర్‌కు మాత్రం రూ.10,91,240 పరిహారంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అలాగే జాతీయ రహదారికి మరో వైపున ఉన్న 508/1సీ/1/2 సర్వే నంబర్ భూమికి రూ.60,54,600 పరిహారాన్ని నిర్ణయించారు. ఇదే వరుసలో ఉన్న 534/1ఏ/2 సర్వే నంబర్‌లోని భూమికి రూ.10,91,240 చొప్పున చెల్లిస్తామంటున్నారు. ఈ నిర్ణయంపై రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తాము నష్టపోతున్న భూమికి ఒకే విధమైన పరిహారాన్ని చెల్లిస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదని అంటున్నారు. అయితే పరిహారం నిర్ణయించడంలో అధికారుల తీరు అనేక సందేహాలకు తావిస్తోందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
భూమి నష్టపోయే రైతు నష్టాన్ని ఎవరూ పూడ్చలేరు. పరిహారం నిర్ణయించే విషయంలో అధికారులు అసమానతలు ఎందుకు చూపారో అర్థం కావడం లేదు. వివక్ష సరికాదు.
– సింగిరెడ్డి గంగారెడ్డి, రైతు, దొన్కల్
భూమిని నష్టపోతున్న రైతులకు పరిహారం చెల్లించే విష యంలో ప్రభుత్వం స్పందించాలి. లేకుండా పోరాటం చేస్తాం. ఎంతో విలువై న భూములను కోల్పోతున్నాం. – ఏనుగు కిరణ్, రైతు, దొన్కల్
కమ్మర్‌పల్లిలో ఒకలా..
జగిత్యాల్ జిల్లా సరిహద్దులో ఉన్న గండిహనుమాన్ మందిరం నుంచి కమ్మర్‌పల్లి శివారులోని పాటి హనుమాన్ మందిరం వరకు జాతీయ రహదారిని విస్తరించేందుకు ఇరువైపులా భూమిని సేకరిస్తున్నారు. ఇక్కడ ఒక్కో ఎకరానికి రూ.కోటికి తగ్గకుండా పరిహారం చెల్లించాలని నిర్ణయించారు. దొన్కల్ వద్ద 40 ఎకరాల భూమిని రహదారికి ఇరువైపులా రైతులు నష్టపోతుండగా.. ఆ భూమి అంతా ఒకే వరుస క్రమంలో ఉందని, అలాంటప్పుడు పరిహారం ఒకేలా ఉండాలని రైతులు అంటున్నారు. పరిహారం చెల్లింపులో స్వల్ప తేడా ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదని, 90 శాతానికి మించి తేడా ఎలా ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. అన్ని భూములకు ఒకే విధంగా పరిహారం చెల్లించకుంటే భూములు ఇచ్చేది లేదంటున్నారు.
నేషనల్ హైవే 63 విస్తరణ..
భూములు నష్టపోతున్న రైతులకు
పరిహారంలో తేడాలు
ఒక ఎకరానికి రూ.1.14 కోట్లు..
పక్కనే ఉన్న మరో ఎకరానికి రూ.10.91 లక్షలు..
నిర్దిష్టమైన విధానం కరువు
అధికారుల తీరుపై రైతుల నిరసన

ఒక్కో ధర

ఒక్కో ధర

ఒక్కో ధర