విక్రయానికి సిద్ధంగా ఉన్న లక్ష్మీదేవి ప్రతిమలు
నిజామాబాద్ నగర మార్కెట్‌లో దీపావళి సందడి నెలకొంది. జిల్లా ప్రజలు పండుగకు ఒకరోజు ముందుగానే ఆదివారం సామగ్రి కోసం తరలిరావడంతో నగరమంతా కిటకిటలాడింది. నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో, రోడ్ల పక్కన ప్రమిదలు, పూలు, పండ్లు, పూజా సామగ్రి, టపాసుల దుకాణాలను వ్యాపారులు పోటాపోటీగా ఏర్పాటు చేశారు. దీపావళి నేపథ్యంలో లక్ష్మీపూజకు కావాల్సిన అమ్మవారి చిత్రపటాలతోపాటు మట్టి ప్రతిమలు సైతం అందుబాటులో ఉన్నాయి. అలాగే టపాసులు అమ్మేందుకు దుకాణాదారులు నగరంలోని పాలిటెక్నిక్ గ్రౌండ్‌లో ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేశారు. మిఠాయి దుకాణాల్లోనూ స్వీట్ల ఆర్డర్లు చాలానే వచ్చాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. దీంతో నగరంలో ఎక్కడ చూసిన పండుగ సామగ్రి కొనుగోళ్లతో దీపావళి శోభ సంతరించుకుంది.
–నిజామాబాద్ రూరల్/సాక్షి ఫొటోగ్రాఫర్, నిజామాబాద్
నగరంలో దీపావళి సందడి
నగరంలో దీపావళి సందడి
నగరంలో దీపావళి సందడి
నగరంలో దీపావళి సందడి
నగరంలో దీపావళి సందడి
నగరంలో దీపావళి సందడి
నగరంలో దీపావళి సందడి