
ఫలించిన ప్రయత్నాలు
మోర్తాడ్(బాల్కొండ): అధికార, ప్రతిపక్ష పార్టీల నే తలు, అధికారుల ప్రయత్నాలు ఫలించాయి. ఉపా ధి కోసం జోర్డాన్ వెళ్లి ఇబ్బందిపడుతున్న వలస కార్మికులు స్వదేశానికి వచ్చేందుకు మార్గం సుగమమైంది. ఈ నెల 25వ తేదీలోగా రాష్ట్రానికి చెందిన 12 మంది ఇంటికి చేరనున్నారు. వివరాలు ఇలా.. ఏడాది క్రితం జోర్డాన్‌లోని వ్యవసాయ క్షేత్రాల్లో పని చేసేందుకు తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్, బి హార్ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు వెళ్లారు. ఇందులో మన రాష్ట్రానికి చెందిన 12 మంది వలస కార్మికులు వారి గోడును వెళ్లబోసుకున్నారు. జోర్డా న్‌లో తాము పడుతున్న కష్టాలపై వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి, మాజీ మంత్రి హరీశ్‌రావుకు లేఖ రాశారు. మదద్ పోర్టల్‌లో కేసు నమోదు చేయించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు జీఏడీ ఎన్నారై విభాగం ఐఏఎస్ అధికారులు సయ్యద్ అలీ ముర్తుజా, శివలింగయ్యలతోపాటు మాజీ మంత్రి హరీశ్‌రావు, రా జ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్‌రెడ్డి విదేశాంగ శాఖ అధికారులతో మాట్లాడారు. జోర్డాన్ రాజధాని అ మ్మాన్‌లోని భారత రాయబార కార్యాలయం అధికారులు మిల్లీనియం అగ్రికల్చర్ ఇన్వెస్టిమెంట్స్ కంపెనీలో ఉపాధి పొందుతున్న వలస కార్మికుల వద్ద కు వెళ్లారు. వారి వివరాలను నమోదు చేసుకొని జో ర్డాన్ విదేశాంగ శాఖతో సంప్రదింపులు జరిపారు.
ఒప్పందం ఉల్లంఘించినందుకు జరిమానా..
రెండేళ్లపాటు మిల్లీనియం అగ్రికల్చర్ ఇన్వెస్టిమెంట్స్ కంపెనీలో పనిచేసేందుకు వలస కార్మికులు జోర్డాన్‌కు వెళ్లే ముందు ఒప్పంద పత్రం రాసి ఇచ్చారు. ఏడాదికి ముందుగానే ఇంటికి వచ్చేస్తుండటంతో ఒప్పందం ప్రకారం జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కో కార్మికుడు కనీసం రూ.50వేల జరిమానాను కంపెనీకి చెల్లించాలి. కార్మికుల ఆర్థిక పరిస్థితి బాగులేకపోవడంతో మాజీ మంత్రి హరీశ్ రావు ఆర్థిక సాయం చేయడంతో కంపెనీకి 12 మంది కార్మికుల తరఫున జరిమానా చెల్లించారు. సొంతంగానే విమాన టిక్కెట్‌ను కొనుగోలు చేసుకొని ఇంటికి రావాల్సి ఉండటంతో హరీశ్‌రావు స్వయంగాా టిక్కెట్లను కొనుగోలు చేసి ఇస్తున్నారని సిద్దిపేట్ జిల్లా దుబ్బాకకు చెందిన పెండ్యాల మహేందర్ ‘సాక్షి’తో చెప్పారు.
జోర్డాన్ నుంచి స్వదేశానికి రానున్న
వలస కార్మికులు
రాష్ట్రానికి చెందిన 12 మంది ఈనెల
25లోగా ఇంటికి చేరుకునే అవకాశం
అధికార, ప్రతిపక్ష నేతల కృషితో
వేగంగా స్పందించిన విదేశాంగ శాఖ
ఊపిరి పీల్చుకుంటున్న
బాధిత కుటుంబాలు