
సెమీస్‌కి చేరిన జిల్లా వాలీబాల్ జట్టు
నిజామాబాద్ నాగారం: మహబూబ్ నగర్ జిల్లాలో ఎస్‌జీఎఫ్ అండర్ 17 బాలికల రాష్ట్రస్థాయి వాలీబా ల్ టోర్నమెంట్ కొనసాగుతోంది. పోటీల్లో నిజామాబాద్ జట్టు సెమీస్‌కు చేరినట్లు సమాచారం. ఈసందర్భంగా క్రీడాకారులకు జిల్లా క్రీడల కార్యదర్శి నాగమణి ఒక ప్రకటనలో అభినందనలు తెలిపారు.
‘సాగర్’ గేటు ఎత్తివేత
నిజాంసాగర్(జుక్కల్): ఎగువ ప్రాంతాల నుంచి 7,048 క్యూసెక్కుల వరద నీరు వస్తుండటంతో ఆదివారం నిజాంసాగర్ ప్రాజెక్టు ఒక వర ద గేటును ఎత్తారు. వరద గేటు ద్వారా 4,048 క్యూ సెక్కుల నీటిని మంజీరా నదిలో వదులుతున్నామ ని ప్రాజెక్టు ఏఈ సాకేత్ తెలిపారు. నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు (17.8 టీఎంసీల)కు ప్రస్తుతం 1405 అడుగులు (17.8 టీఎంసీల) నీరు నిల్వ ఉందని పేర్కొన్నారు.

సెమీస్‌కి చేరిన జిల్లా వాలీబాల్ జట్టు