
ధ్రువపత్రాల భద్రతకు ‘డిజిలాకర్’
మీ కోసం..
సదాశివనగర్(ఎల్లారెడ్డి): ప్రయాణాలు ఇతర సందర్భాల్లో చాలా మంది ఉత్తీర్ణత, ఇతర విలువైన ధ్రువపత్రాలను మరిచిపోతున్నారు. ఒక్కోసారి పోగొట్టుకున్న పత్రాలను తిరిగి పొందడం కష్టంతో కూడుకున్న పని. ఇలాంటి పరిస్థితిని అధిగమిస్తూ ఎలాంటి ధ్రువపత్రాలనైనా భద్రంగా దాచుకునేలా కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. అదే డిజిలాకర్.
● కాగిత రహిత పాలనను ప్రోత్సహించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 2016లో ప్రారంభించిన ఈ డిజిలాకర్‌ను విద్యార్థులు, నిరుద్యోగులే కాకుండా ప్రతి ఒక్కరూ విలువైన పత్రాలను దా చుకునేందుకు బ్యాంక్ లాకర్‌గా పనిచేస్తోంది.
● డిజిటల్ విధానంలో దాచుకున్న పత్రాలను ఎక్కడైనా, ఏ సమయంలోనైనా అవసరమైనప్పుడు ఉపయోగించుకోవచ్చు.
● ఇవి వాస్తవ ధ్రువీకరణ పత్రాల మాదిరే చట్టపరంగానూ చెల్లుబాటు అవుతాయి.
● లాకర్ సహాయంతో పంపించే ఈ పత్రాలను వాటి క్యూఆర్ కోడ్ లేదా డిజిటల్ సంతకాలతో నిర్ధారణ జరుగుతుంది.
● డిజిలాకర్ ఖాతాకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
● ఆధార్ కార్డు, దానితో అనుసంధానమైన ఫోన్ నంబర్‌తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
● అనంతరం ఓటీపీతో లాగిన్ అయితే మన ఆధార్‌పై లాకర్ తెరుచుకుంటుంది.
● డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ ధ్రువపత్రాలు, విద్యార్హత ధ్రువపత్రాలు, ఆధార్, ఓటరు ఐడీ, పాన్‌కార్డు, పాస్‌పోర్టు, జనన ధ్రు వపత్రాలు, విద్యార్హత ఇలా అన్ని రకాల పత్రా లను స్కాన్ చేసుకొని భద్రపరుచుకోవచ్చు.
● ఒక్కొక్కరూ ఒక జీబీ వరకు డాటా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది.