నిజామాబాద్‌ | - | Sakshi
Sakshi News home page

నిజామాబాద్‌

Oct 19 2025 6:07 AM | Updated on Oct 19 2025 6:07 AM

నిజామ

నిజామాబాద్‌

న్యూస్‌రీల్‌

బిసీ కులాల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ

నిరసనల్లో పాల్గొన్న వివిధ

రాజకీయ పార్టీల నాయకులు

ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద బైఠాయింపు

నగరంలో బైక్‌ ర్యాలీ

గురుకులాలపై ‘ప్రత్యేక’ గురి

సాంఘిక సంక్షేమ గురుకులాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. సమస్యల

పరిష్కారానికి చొరవ చూపుతున్నారు.

ఆదివారం శ్రీ 19 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2025

– 10లో u

నిర్మానుష్యంగా బస్టాండ్‌

బీసీ బంద్‌

నిజామాబాద్‌అర్బన్‌ : రాష్ట్ర బీసీ జేఏసీ పిలుపు మేర కు శనివారం జిల్లా వ్యాప్తంగా బంద్‌ విజయవంతమైంది. ఆర్మూర్‌, బోధన్‌, బాల్కొండ తదితర ప్రాంతాల్లో స్వచ్ఛందంగా వ్వాపారస్తులు, ప్రయివేటు పాఠశాలలు బంద్‌ పాటించారు. ఉదయం 3 గంటలకే బీసీ సంఘాల నాయకులు నిజామాబాద్‌ ఒకటవ, రెండవ డిపోల ముందు బైఠాయించారు . బస్సులను అడ్డుకున్నారు. కాంగ్రెస్‌, బీజేపీ వామపక్షాల నాయకులు ఆర్టీసీ డిపో ముందు బైఠాయించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ ఇవ్వాలని డి మాండ్‌ చేశారు. బీసీ సంఘల నాయకులు నగరంలో బైక్‌ర్యాలీ నిర్వహించారు. నగరంలో బస్‌స్టాండ్‌ నుంచి పాత కలెక్టరేట్‌, పూలాంగ్‌ చౌరస్తా బోర్గం(పి) వరకు, అక్కడి నుంచి ధర్న చౌక్‌ వరకు వచ్చా రు. అనంతరం నిర్వహించిన దీక్ష శిబిరంలో వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. జిల్లా బీసీ సంక్షే మ సంఘం నాయకులు సుధాకర్‌, బుస్సా ఆంజనేయులు పాల్గొన్నారు

సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో నగరంలో ర్యాలీ నిర్వహించారు. న్యూ డెమోక్రసీ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ద్వారక నగర్‌ నుంచి బస్టాండ్‌ రైల్వే స్టేషన్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ఆకుల పాపయ్య మాట్లాడుతూ బీసీలు అత్యధిక జనాభా ఉండి కూడా రిజర్వేషన్‌ ఫలాలను అందుకోలేకపోతున్నారన్నారు. తెలంగాణ మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బంద్‌లో జిల్లా అధ్యక్షుడు మల్లాని శివ మాదిగ పాల్గొని మాట్లాడారు. ఎమ్మార్పీఎస్‌ నాయకులు బంధ్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. బోరం్గ(పి)లో మాది గ కుల సంఘాలు, బీసీ సంఘాలు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులతో బంద్‌ కార్యక్రమం నిర్వహించారు. అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ధర్నా చౌక్‌ వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్‌ పాల్గొన్నారు.

దిష్టిబొమ్మ దహనం

సీపీఐ ఎమ్మెల్సీ మాస్‌లైన్‌ ప్రజాపంథా నాయకులు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. వనమాల కృష్ణ పాల్గొన్నారు. నుడా చైర్మన్‌ కేశ వేణు, నరాల రత్నాకర్‌, కాంగ్రెస్‌ పా ర్టీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్‌ రెడ్డి, బీఎల్‌పీ రాష్ట్ర పార్టీ అధ్యక్షు డు దండి వెంకట్‌, మహిళా రాష్ట్ర నాయకురాలు సబ్బని లత, మాల మహానాడు నాయకులు గైని గంగారం, దేవిదాస్‌, సుధాకర్‌, తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షులు అవంతి రావు, ప్రజా హక్కుల సంఘం నాయకులు భాస్కర్‌, పీడీఎస్‌యూ నాయకు లు గణేష్‌, ఆంజనేయులు, గంగకిషన్‌ పాల్గొన్నారు.

బంద్‌లో భాగంగా బీసీల కులాల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో పాత కలెక్టరేట్‌ వద్ద నిరసన చేశారు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌, ఎస్‌ఎస్‌ఆర్‌ విద్యాసంస్ధల అదినేత మా రయ్యగౌడు, బీఆర్‌ఎస్‌ నాయకుడు దాదాన్నగా రి విఠల్‌రావు పాల్గొన్నారు. పోతన్‌కర్‌ లక్ష్మినారాయణ ఆధ్వర్యంలో ఈ నిరసన చేశారు.

నిజామాబాద్‌1
1/3

నిజామాబాద్‌

నిజామాబాద్‌2
2/3

నిజామాబాద్‌

నిజామాబాద్‌3
3/3

నిజామాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement