
అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
● కానిస్టేబుల్ ప్రమోద్‌కు కన్నీటి వీడ్కోలు
● నివాళులు అర్పించిన ఐజీ, సీపీ
నిజామాబాద్‌అర్బన్ : సీసీఎస్ కానిస్టేబుల్ ప్ర మోద్ అంత్య క్రియలు నగరంలో శనివారం అ ధికారిక లాంఛనాలతో పూర్తయ్యాయి. స్థానిక రైల్వే కమాన్ ప్రాంతంలోని బ్యాంకు కాలనీలో ని ఆయన నివాసం నుంచి శవ యాత్ర ప్రారంభమైంది. ఈ అంత్యక్రియలకు మల్టీజోన్– 1 నార్త్ తెలంగాణ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, సీపీ సా యి చైతన్య, పోలీస్ అధికారులు హాజరయ్యా రు. ప్రమోద్ కుటుంబానికి అండగా ఉంటామ ని సీపీ పేర్కొన్నారు. ప్రమోద్ పార్థీవ దేహానికి నివాళులు అర్పించారు. శవ యాత్రలో పాడె మోశారు. ఈ సందర్భంగా ఐజీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ నిందితుడు రియాజున్ త్వరలోనే పట్టుకుంటామన్నారు. శాంతి భద్రతల వి షయంలో ఉపేక్షించబోమన్నారు.
కానిస్టేబుల్ కుటుంబానికి అండగా ఉంటాం..
కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి అండగా ఉంటామని సీపీ సాయి చైతన్య పేర్కొన్నారు. ఉదయం ప్రభుత్వ మెడికల్ కశాశాలలో మీడి యాతో మాట్లాడారు.
నిందితుడు రియాజ్‌ను పట్టుకునేందుకు కానిస్టేబుల్ ప్రమోద్‌తో పాటు సీసీఐ ఎస్సై కూ డా ఉన్నారన్నారు. దురదృష్టవశాత్తు పోలీసు ఫ్యామిలీలో ఒక్కరు చనిపోవడం చాలా బా ధాకరమన్నారు. కానిస్టేబుల్ కుటుంబానికి ప్ర తి ఒక్కరు అండగా ఉండాలన్నారు. కొందరు ఘటనపై రాజకీయలు చేయడం తగదన్నారు.
కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు రియాజ్ ను పట్టుకునేందుకు ఎనిమి ది పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. శుక్రవారం బాబన్‌సాహెబ్ పహాడ్ వద్ద కెనల్ కట్ట ప్రాంతంలో మొదట రియాజ్‌ను పట్టుకునేందుకు కానిస్టేబుల్ ప్రయత్నం చేశాడు. కెనాల్ కాల్వ గుండా పారిపోతున్న రియాజ్‌ను వెంబడించి పట్టుకున్నాడు.
అనంతరం తన బైక్‌పై సీసీఎస్ ఎస్సై విఠల్ ఆధ్వర్యంలో అరెస్టు చేసి బైౖక్‌పై తీసుకువస్తున్నారు. ఈ సందర్భంలోనే రియాజ్ కానిస్టేబుల్‌ను పొడిచి హత్య చేశారు. ఇతను ఎక్కడికి పారిపోయాడు.. ఎలా పారిపోయాడు కోణంలో పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. నిందితుడు రియాజ్ సెల్‌ఫోన్ వదిలేసి మరో బైక్ ను దొంగిలించి పారిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. అర్ధరాత్రి 12 గంటల వరకు నగరంలోనే ఉన్నట్లు పోలీసులకు సమాచారం.
కొన్ని బృందాలు పట్టణంలో గాలింపు చర్యలు చేపడుతున్నాయి. మరికొన్ని బృందాలు రియాజ్ తరచుగా వెళ్లే ప్రాంతాలను జల్లెడ పడుతున్నాయి. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని సీపీ సాయి చైతన్య అన్నారు.

అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు