
నాలుగో స్తంభానికి పొంచివున్న ప్రమాదం
పత్రిక స్వేచ్ఛను కాపాడాలి
ఏపీలోని కూటమి ప్ర భు త్వం అక్రమ కేసులతో జర్నలిస్టులను భయభ్రాంతులకు గురిచేయడం సరి కాదు. ఇది సాక్షి పత్రికపై దాడి మాత్రమే కాదు రాజ్యాంగంపై దాడిగా పరిగణిస్తున్నాం.పత్రికా స్వేచ్ఛను కాపాడాలి. – మానాల మోహన్‌రెడ్డి, డీసీసీ
అధ్యక్షుడు, రాష్ట్ర సహకార సంఘం లిమిటెడ్ చైర్మన్
‘సాక్షి’ దినపత్రిక, ఎడిటర్ ధనంజయ రెడ్డిపై ఏపీలోని కూటమి ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టి వేధించడాన్ని ప్రజాస్వామిక వాదులు, ప్రజాప్రతినిధులు, పలు రాజకీయ పార్టీల నేతలు ఖండించారు. పత్రికపై దాడిని ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణించారు. వాస్తవాలు వెలుగులోకి తెస్తూ.. ప్రజలను అప్రమత్తం చేస్తున్న ‘సాక్షి’ వంటి ప్రజామోదం పొందిన పత్రికను ఇబ్బందుల పాలు చేస్తే ప్రజలే గుణపాఠం చెబుతారని అన్నారు. ఏపీలోని కూటమి ప్రభుత్వాల వంటి వాటితో నాలుగో స్తంభానికి ప్రమాదం పొంచివుందన్నారు. – నిజామాబాద్ సిటీ
‘సాక్షి’ పై దాడి ప్రజాస్వామ్యంపై దాడిగానే పరిగణిస్తున్నాం
ఏపీలోని కూటమి ప్రభుత్వం
పెట్టిన అక్రమ కేసులను
ఎత్తివేయాలి
రాజకీయ నేతలు, ప్రజా సంఘాలు,
జర్నలిస్టు సంఘాల ప్రతినిధుల
మనోభిప్రాయాలు

నాలుగో స్తంభానికి పొంచివున్న ప్రమాదం