
ధాన్యం తూకంలో తరుగు తీస్తే చర్యలు
● జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
రుద్రూర్ : ధాన్యం సేకరణలో అవకతవకలు జరిగితే బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి హెచ్చరించారు. రుద్రూర్, పోతంగల్, కోటగిరి మండలంలోని కొత్తపల్లి ధా న్యం కొనుగోలు కేంద్రాలను శనివారం ఆయన పరిశీలించారు. సేకరించిన ధాన్యం వివరాలు తెలు సుకున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాట్లను పరిశీలించారు. కొన్నిసార్లు తూకం వేయకుండానే ధా న్యం నింపి పంపిస్తున్నారని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. కొనుగోలు కేంద్రాల్లో ప్రతి ధాన్యం బస్తాను తప్పని సరిగా కాంటా చేసిన తరువాతనే మిల్లులకు తరలించాలని నిర్వాహకులకు కలెక్టర్ సూచించారు. తరుగు, కోతలను అమలు చేస్తే చర్య లు తీసుకుంటామన్నారు. కొనుగోలు కేంద్రాలకు సరిపడా గన్నీ బ్యాగులు కేటాయించాలని, వర్షాల కు ధాన్యం తడిసిపోకుండా టార్పాలిన్‌లు అందుబాటులో ఉంచాలన్నారు. రైస్ మిల్లుల నుంచి ట్రక్ షీట్లు తెప్పించుకుని వేగంగా ట్యాబ్ ఎంట్రీలు చేయాలని, దీంతో సకాలంలో రైతులకు బిల్లుల చెల్లింపులు జరుగుతాయన్నారు. క్రాప్ బుకింగ్ జాబితాలో పేర్లు లేని రైతులు పంట సాగు చేస్తే క్షేత్ర స్థాయిలో పరిశీలించి సంబంధిత రైతులకు ధ్రువీకరణ పత్రాలు అందించాలని ఏఈవోలను ఆదేశించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ కిరణ్‌కుమార్, జిల్లా సహకార అధికారి శ్రీనివాస్, తహసీల్దార్‌లు గంగాధర్, తారాబాయి, వ్యవసాయ అధికారులు సాయి కృష్ణ, రాజు, నిశిత ఉన్నారు.