
డిప్యుటేషన్లు, బదిలీలకు దరఖాస్తులు
ఖలీల్‌వాడి : జిల్లాలోని లోకల్ కేడర్ తాత్కాలిక డిప్యుటేషన్లు, బదిలీల కోసం అర్హత కలి గిన ఉద్యోగులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చే సుకోవాలని డీఈవో అశోక్ కుమార్ ఒక ప్రక టనలో తెలిపారు. జీవో నెంబర్ 190, జనర ల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంట్ జీవో నెంబ ర్ 190 ప్రకారం సబ్–కమిటీ సిఫార్సులలో ఉన్న సబ్జెక్టు ఖాళీలకు లోబడి దరఖాస్తులకు ప్రభుత్వం అనుమతించిందని తెలిపారు. పాఠశాల విద్య (ఎస్‌పీఎఫ్‌ఐఐ) జీవో నెంబ ర్ 25ను ఈనెల 12న ఉత్తర్వులు జారీ చేసిన ట్లు చెప్పారు. నిబంధనల ప్రకారం జిల్లాలో ని బోధన, బోధనేతర ఉద్యోగులు అక్టోబర్ 17 నుంచి 24 వరకు ఇంటర్ లోక ల్ కేడర్ తాత్కాలిక డిప్యుటేషన్ల కోసం schooledu. telangana.go.in పోర్టల్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
నూతన ఓటర్లకు
గుర్తింపు కార్డులు
● రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి
సుదర్శన్ రెడ్డి
నిజామాబాద్‌అర్బన్ : నూతన ఓటర్లకు గు ర్తింపు కార్డులను తపాలా శాఖ ద్వారా సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి సూ చించారు. గురువారం హైదరాబాద్ నుంచి ఇతర అధికారులతో కలిసి సీఈవో సుదర్శన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్‌న్స్ ద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, సహాయ ఎన్నికల అధికారులు, తహసీల్దార్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఈవో మాట్లాడుతూ.. ఓటరు జాబితాలో 100 సంవత్సరాల వయసు కలిగిన ఓటర్లను గుర్తించి వారి వయసును తగిన ఆధారాలతో సమర్పించాలన్నారు. బూత్ స్థాయి అధికారులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేయాలని, ఫారం 6, 7, 8 దరఖాస్తులను వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. వీడియో కాన్ఫరెనన్స్‌లో కలెక్టర్ టి వినయ్ కష్ణారెడ్డి, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, ఏవో ప్రశాంత్, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.
నిజామాబాద్ అర్బన్ : నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా మాక్లూర్ మండల కేంద్రంలోని ప్రభు త్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు రూ.కోటి విరాళం ఇచ్చారు. గురువారం ఆ యన తన సోదరుడు బిగాల మహేశ్‌తో కలి సి కలెక్టరేట్‌కు వచ్చి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డికి చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఈవో అశోక్ పాల్గొన్నారు.

డిప్యుటేషన్లు, బదిలీలకు దరఖాస్తులు