
కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి
సుభాష్‌నగర్ : రాష్ట్రంలో వరి కోతలు మొదలు పెట్టి 15 రోజులు కావస్తున్నా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ప్రారంభించలేదని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య అన్నారు. యుద్ధప్రాతిపదికన కేంద్రాలను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. గురువారం నగరంలోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వర్షానికి ధాన్యం తడిసిపోతోందన్నా రు. రైతులు గత్యంతరం లేక క్వింటాలుకు రూ. 1600 నుంచి రూ.1700 వరకు దళారులకు అమ్ము కుని తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. తరుగు పేరు తో అధికారులు, రైస్‌మిల్లర్లు కుమ్మకై ్క రైతులను మోసం చేస్తున్నా రని, సీఎంఆర్ ఇవ్వని రైస్‌మిల్లులను బ్లాక్ లిస్టులో పెట్టాల్సి ఉన్నా అధికారులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. యాసంగి పంటకు బోనస్ డబ్బులు చెల్లించాలన్నారు. సమావేశంలో కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, సీనియర్ నాయకులు న్యాలం రాజు, లక్ష్మీనారాయణ, హరీశ్ రెడ్డి, పంచరెడ్డి శ్రీధర్, శ్రీనివాస్, ఇప్పకాయల కిషోర్, గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.