
వాహనాల చోరీ నిందితుల అరెస్టు
● వివరాలు వెల్లడించిన సీపీ సాయి చైతన్య
నిజామాబాద్‌అర్బన్: జిల్లాలో పలు చోట్ల వాహనా ల దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులను అ రెస్టు చేసినట్లు సీపీ సాయిచైతన్య తెలిపారు. సీసీ ఎస్ పోలీస్‌స్టేషన్‌లో సీపీ గురువారం వివరాలు వెల్లడించారు. కొందరు వ్యక్తులు ఒక ముఠాగా ఏర్ప డి బోధన్, నిజామాబాద్, ఆర్మూర్, ముథోల్‌లో ఆటోలు, బైక్‌లను చోరీ చేసి కోరుట్ల, జగిత్యాల ప్రాంతాల్లో విక్రయిస్తున్నారని తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఆటోనగర్‌కు చెందిన షేక్ ఫజల్, మహ్మద్ నవాజ్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా షేక్‌అలీ, వహిద్, అలీమ్‌లతో కలిసి 9 ఆటోలు, మూడు బైక్‌లు చోరీ చేసినట్లు ఒప్పుకున్నారని తెలిపారు. అపహరించిన వాహనాలను కోరుట్లలో విక్రయించినట్లు పేర్కొన్నారు. దొంగ వాహనాలను కొనుగోలు చేసిన మహ్మద్ ఇమ్రాన్, మహ్మద్ ఇలియాస్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. పరారీలో ఉన్న మరో ముగ్గురిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. కేసును త్వరిగతిన ఛేదించిన సీసీఎస్ ఏసీపీ నగేంద్రచారి, సీఐ సాయినాథ్, ఇతర పోలీసు సిబ్బందిని సీపీ అభినందించారు.