
మొక్కజొన్న తూకంలో మోసం
● రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ వ్యాపారులు
భిక్కనూరు: మండలంలోని గుర్జకుంట గ్రామంలో తూకంలో మోసం చేస్తూ వ్యాపారులు పట్టుబడ్డ ఘటన గురువారం చోటుచేసుకుంది. గాంధారి ప్రాంతానికి చెందిన గిరిజన వ్యాపారులు భిక్కనూరు మండలం గుర్జకుంటలో ఒక ఏజెంట్‌ను పెట్టుకొని మొక్కజొన్నలను కోనుగోలు చేస్తున్నారు. మొక్కజొన్న బస్తాను 62 కిలోల చొప్పున తూకం వేస్తున్నట్లు రైతులను నమ్మించి 72 కిలోల మొక్కజొన్నలను బస్తాలో నింపి వాహనాల్లో వేశారు. రైతులకు అనుమానం రావడంతో తూకం వేసే ఎలక్ట్రానిక్ కాంటా 10కిలోలు మైనస్‌లో చూపించడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏజెంట్‌ను, గాంధారి వ్యాపారులను నిలదీశారు. ఒక దశలో తూకంలో మోసానికి పాల్పడిన వారిని చెట్లకు కట్టివేయాలని పలువురు రైతుల యత్నించగా మిగతా రైతులు వారిని సముదాయించారు. చివరికి వ్యాపారులకు జరిమానా విధించి వదిలిపెట్టారు.