
బీసీ బంద్‌కు అఖిలపక్షం మద్దతు
నిజామాబాద్‌నాగారం: రాష్ట్రవ్యాప్త బీసీ బంద్‌కు అఖిలపక్ష పార్టీల మద్దతు ఉందని బీసీ జేఏసీ ప్రతినిధులు తెలిపారు. నగరంలోని గీతాభవన్‌లో గురువారం ఏర్పాటు చేసిన రౌండ్‌టేబుల్ సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్ర బీసీ జేఏసీ పిలుపు మేరకు ఈ నెల 18న తలపెట్టిన బీసీ బంద్‌కు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్, టీడీపీ, సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ ప్రజాపంథా, ఎంఐఎం పార్టీలు, కుల సంఘాలు, ప్రజాసంఘాలు, డాక్టర్లు, లాయర్లు, జర్నలిస్టులు మద్దతు తెలిపినట్లు పేర్కొన్నారు. అన్ని సంఘాలు ప్రత్యక్షంగా బంద్‌లో పాల్గొంటామని బీసీ జేఏసీకి హామీ ఇచ్చాయని తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలయ్యే వరకు శాంతియుత ఉద్యమం చేస్తామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీసీ జేఏసీ చైర్మన్ పోతనకర్ లక్ష్మీనారాయణ, వైస్ చైర్మన్ బొబ్బిలి నర్సయ్య, బీఆర్‌ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి, జెడ్పీ మాజీ చైర్మన్ దాదన్న గారి విఠల్‌రావు, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి స్వామి యాదవ్, కాంగ్రెస్ ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షులు రాజ నరేందర్ గౌడ్, సీపీఐ నగర కార్యదర్శి ఓమయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి సుధాకర్, ఆయా పార్టీలు, కుల సంఘాల, డాక్టర్స్, పీఎంపీ, స్టూడెంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
గోడప్రతుల ఆవిష్కరణ
రాష్ట్ర బీసీ జేఏసీ బంద్‌కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. గురువారం బంద్‌కు సంబంధించిన గోడపత్రులను ఆయన ఆవిష్కరించా రు. బీసీలంటే తనకు ఎనలేని గౌరవమని, వారి కో సం తాను ముందు వరుసలో ఉండి న్యాయం చేసే లా చూస్తానని అన్నారు. కార్యక్రమంలో నరాల సుఽ దాకర్‌తోపాటు బుస్స ఆంజనేయులు, ఆకుల ప్రసా ద్, దర్శనం దేవేందర్, కొయ్యాడ శంకర్, బసవసాయి చంద్రకాంత్, చైతన్య పాల్గొన్నారు.