కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
నిజామాబాద్‌అర్బన్: ఆకస్మిక గుండెపోటుకు గురైన వ్యక్తులకు సకాలంలో సీపీఆర్ చేసి ప్రాణాలను రక్షించవచ్చని, దీనిపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరమని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి పేర్కొ న్నారు. ఐడీవోసీ సమావేశ మందిరంలో వైద్యశాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన సీపీఆర్‌పై అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఆకస్మికంగా కొందరికి గుండెపోటు వచ్చి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని, అలాంటి వారికి సీపీఆర్‌తో ప్రథమ చికిత్స చేస్తే ప్రాణాపా య స్థితి నుంచి బయటపడతారన్నారు. జిల్లాలో సీ పీఆర్‌పై ఈ నెల 13 నుంచి 17వ తేదీ వరకు అ వగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపా రు. అనంతరం సీపీఆర్ ఎలా చేయాలన్న దానిపై మాస్టర్ ట్రైనర్స్ డాక్టర్ వెంకటేశ్, వేణుగోపాల్ అ వగాహన కల్పించారు. కార్యక్రమంలో ట్రెయినీ కలె క్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, డీఎంహెచ్‌వో రాజ శ్రీ, హౌసింగ్ పీడీ పవన్ కుమార్, డిప్యూటీ సీఈవో సాయన్న తదితరులు పాల్గొన్నారు.