
గురుకులాల్లో మిగిలిన సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్): జిల్లాలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2025–26 విద్యాసంవత్సరానికి 5 నుంచి 9వ తరగతులలో మిగిలిన సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గురుకుల విద్యాలయా ల సంస్థ జిల్లా సమన్వయ అధికారి మాధవీలత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 23 ఫిబ్రవరి 2025న నిర్వహించిన ప్రవేశపరీక్షకు విద్యార్థులు హాజరై ఉండాలని పేర్కొన్నారు. 2024–25 విద్యా సంవత్సరంలో ఏదైనా ప్రభు త్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 4, 5, 6, 7, 8వ తరగతులు పూర్తిచేసి ఉండాలన్నారు. లాటరీ పద్ధతిలో సీట్లు కేటాయిస్తారన్నారు. ఈ నెల 17, 18వ తేదీల్లో హాల్‌టికెట్, కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల ఒరిజనల్, జిరాక్స్ ప్రతులతో డిచ్‌పల్లి మండలం ధర్మారం(బి) గ్రామంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలి కల పాఠశాల/కళాశాలలో ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు.
నిజామాబాద్ అర్బన్: ఈ నెల 21న నిర్వహించే పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా పోలీసులకు సంబంధించిన అంశాలపై షార్ట్ ఫిల్మ్ తీసేందుకు ఆసక్తి ఉన్న ఫొటో, వీడియోగ్రాఫర్లు దర ఖాస్తు చేసుకోవాలని సీపీ సాయి చైతన్య ఒక ప్రకటనలో తెలిపారు. 2024 అక్టోబర్ నుంచి 2025 అక్టోబర్ వరకు అత్యవసర సమయాల్లో పోలీసుల సేవలు, ప్రకృతి వైపరీత్యాల్లో పోలీసుల విధులు, సైబర్ నేరాలు, ర్యాగింగ్ మత్తు పదార్థాల నిషేధంలో పోలీసుల కృషి తదితర అంశాలపై ఫోటోలు, వీడియోలు ఉండాలన్నారు. వివరాలకు 94400 1827 నెంబర్‌లో సంప్రదించాలని పేర్కొన్నారు.
● ఒక్కటైన ప్రేమజంట
నిజాంసాగర్(జుక్కల్): మహ్మద్‌నగర్ మండలం తెల్గాపూర్ గ్రామానికి చెందిన దనుల రవీందర్, నేపాల్‌కు చెందిన మాయ ఒక్కటయ్యారు. గురువారం తెల్గాపూర్ గ్రామంలో వేద పండితుడు, గ్రామస్థుల సమక్షంలో ఇద్దరి పెళ్లి సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. వివరాలు ఇలా ఉన్నాయి. తెల్గాపూర్ గ్రామానికి చెందిన దనుల వెంకవ్వ, ఎల్లయ్య దంపతులు రెండో కుమారుడు రవీందర్ ఏడు సంవత్సరాల నుంచి దుబాయ్‌లో ఉంటూ ఉపాధి పొందుతున్నాడు. రవీందర్ పని చేస్తున్న కంపెనీలోనే నేపాల్‌కు చెందిన మాయ పనిచేస్తోంది. మూడు సంవత్సరాల నుంచి ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. పది రోజుల కిందట రవీందర్‌తోపాటు మాయ దుబాయ్ నుంచి తెల్గాపూర్ గ్రామానికి వచ్చారు. రవీందర్ తన తల్లిదండ్రులను ఒప్పించి మాయను వివాహం చేసుకున్నారు.